హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీగా ఎగిసిన మంటలు: ప్రయాణికుల పరుగులు
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్‌లో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీగా మంటలు చెలరేగాయి. తమిళనాడులోని తిరుచురాపల్లి- శ్రీ గంగానగర్ మధ్య ఈ రైలు నడుస్తోంది. ఈ రైలు వల్సాద్ స్టేషన్ సమీపంలోకి వచ్చిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.
శనివారం మధ్యాహ్నం గుజరాత్‌లోని వల్సాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే శ్రీ గంగానగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరేటర్ కోచ్ పక్కనే ఉన్న ప్యాసింజర్ కారులో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. దీంతో వెంటనే రైలును నిలిపివేశారు. హుటాహుటిన రయాణికులందరూ దిగిపోయారని, ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

మంటలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందడంతో రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
#WATCH | Fire breaks out in Humsafar Express, which runs between Tiruchirappalli and Shri Ganganagar, in Gujarat's Valsad; no casualty reported till now pic.twitter.com/p5Eyb7VQKw
— ANI (@ANI) September 23, 2023
"తిరుచ్చిరాపల్లి-శ్రీ గంగానగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో వల్సాద్ స్టేషన్ నుంచి సూరత్ వైపు బయలుదేరిన కాసేపటికే మధ్యాహ్నం 2 గంటలకు మంటలు చెలరేగాయి" అని రైల్వే అధికారి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పవర్ కోచ్‌లో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న బి1 కోచ్‌కు వ్యాపించాయని, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు పోలీసు సూపరింటెండెంట్ కరణ్‌రాజ్ వాఘేలా తెలిపారు.
అయితే ఈ అగ్ని ప్రమాద ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. రైలును నిలిపివేసి, భద్రత కోసం ప్రయాణికులందరినీ డీబోర్డ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరగడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications