వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mining Mafia, మైనింగ్ మాఫియా vs పోలీసులు, తూటాలకు పొలిటికల్ లీడర్ భార్య బలి !

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్/లక్నో: మైనింగ్ మాఫియా అంతు చూడాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ప్రభుత్వానికి, పోలీసులకు సవాలు విసిరిన మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. మైనింగ్ మాఫియా లీడర్ ను పట్టించినా, వాళ్ల ఆచూకి చెప్పినా రివార్డు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వేరే రాష్ట్రంలో మాఫియా లీడర్ తలదాచుకున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లారు. ఆ సందర్బంలో పోలీసులు, మైనింగ్ మాఫియా లీడర్స్ మద్య ఎదురుకాల్పులు జరిగాయి. మైనింగ్ మాఫియా లీడర్ మీద పోలీసులు కాల్పులు జరపడంతో బుల్లెట్లు గురి తప్పి పొలిటికల్ లీడర్ భార్య మీదకు దూసుకోవడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది. బీజేపీ లీడర్ ను హత్య చేశారని వేరే రాష్ట్రం పోలీసుల మీద మరో రాష్ట్రం పోలీసులు హత్య కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Human sacrifice: నరబలి టైమ్ లో డాక్టర్ భార్యతో రొమాన్స్, ప్రైవేట్ పార్ట్స్ తో కూర చేసి తినేసి!Human sacrifice: నరబలి టైమ్ లో డాక్టర్ భార్యతో రొమాన్స్, ప్రైవేట్ పార్ట్స్ తో కూర చేసి తినేసి!

 మైనింగ్ మాఫియా లీడర్

మైనింగ్ మాఫియా లీడర్

ఉత్తరప్రదేశ్ లో జాఫర్ అనే మైనింగ్ మాఫియా లీడర్ ఉన్నాడు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాకు జాఫర్ లీడర్ అయ్యాడు.
మైనింగ్ మాఫియా లీడర్ జాఫర్ అంతు చూడాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ప్రభుత్వానికి, పోలీసులకు సవాలు విసిరిన మైనింగ్ మాఫియా లీడర్ జాఫర్ ఇంకా రెచ్చిపోయాడు.

 రూ. 50 వేలు రివార్డు

రూ. 50 వేలు రివార్డు

మైనింగ్ మాఫియా లీడర్ జాఫర్ ను పట్టించినా, అతని ఆచూకి చెప్పినా రూ. 50 వేలు రివార్డు అందిస్తామని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. చాలాకాలంగా పోలీసులు జాఫర్ కోసం గాలిస్తున్నారు. అయితే జాఫర్ ఉత్తరప్రదేశ్ నుంచి పారిపోయి ఉత్తరాఖండ్ లో మకాం వేసి అక్కడి నుంచి మైనింగ్ మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్నాడు.

మైనింగ్ మాఫియా vs పోలీసులు

ఉత్తరాఖండ్ లో మాఫియా లీడర్ జాఫర్ తలదాచుకున్నాడని ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ పోలీసులకు సమాచారం అందడంతో ఉత్తరాఖండ్ కు వెళ్లారు. ఆ సందర్బంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు, మైనింగ్ మాఫియా లీడర్ జాఫర్ వర్గీయుల మద్య ఎదురుకాల్పులు జరిగాయి. జాఫర్ గ్యాంగ్ ను పోలీసులు వెంబడించారు.

 పోలీసు తూటాలకు బీజేపీ లీడర్ భార్య బలి

పోలీసు తూటాలకు బీజేపీ లీడర్ భార్య బలి

మైనింగ్ మాఫియా లీడర్ జాఫర్ ను వెంటాడి అతని మీద ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ సందర్బంలో బుల్లెట్లు గురి తప్పి బీజేపీ నాయకుడు గుర్తాజ్ భోల్లర్ భార్య గురుప్రీత్ కౌర్ మీదకు దూసుకుపోయాయి. పోలీసుల జరిపిన కాల్పులు మిస్ ఫైర్ కావడంతో బీజేపీ లీడర్ భార్య గురుప్రీత్ కౌర్ ప్రా ణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

పోలీసుల మీద హత్య కేసు.... పోలీసులను కట్టేసి

మాఫియా లీడర్ జాఫర్ వర్గీయులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలైనాయి. బీజేపీ లీడర్ భార్యను కాల్చి చంపిన నలుగురు ఉత్తరప్రదేశ్ పోలీసులకు స్థానికులు చితకబాది ఓ ఇంటిలో నిర్బందించారని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ లీడర్ భార్య గురుప్రీత్ ను హత్య చేశారని ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ పోలీసుల మీద ఉత్తరాఖండ్ రాష్ట్రం పోలీసులు హత్య కేసు నమోదు యెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Fire: Mining Mafia, BJP leaders wife killed and five Uttar Pradesh police injuried in Uttarakhand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X