ఒమర్‌పై గెలిచిన ఆనందం: ఏకే 47తో పీడీపీ నేత ఫైరింగ్, వీడియో
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని సోనావర్ నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పైన గెలిచిన ఆనందంలో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి మహమ్మద్ అష్రాఫ్ మిర్ తన నివాసం వద్ద ఏకే 47తో కాల్పులు జరిపారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు, అది వివాదాస్పదంగా మారింది. ఆయన గాలిలోకి కాల్పులు జరుపుతున్న వీడియో బయటకు వచ్చింది. ఒమర్ అబ్దుల్లా సోనావర్, బీరువా నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. సోనావర్‌లో ఓడిన ఒమర్, బీరువాలో మాత్రం గెలుపొందారు.

అయితే, సోనావర్‌లో ఒమర్ అబ్దుల్లా పైన గెలిచిన ఆనందంలో అష్రాఫ్ మిర్ తన ఇంటి వద్ద సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో తన ఏకే 47తో పలురౌండ్లు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చాలామంది చూస్తున్నారు.
కాల్పులు జరపలేదు: మిర్
ఏకే 47తో కాల్పులు జరిపినట్లుగా వీడియో నెట్లో రావడంతో దాని పైన మహమ్మద్ అష్రాఫ్ మిర్ స్పందించారు. తాను ఎలాంటి కాల్పులు జరపలేదని చెప్పారు. తన భద్రత సిబ్బందికి చెందిన ఏకే 47 కిందపడితే తాను దానిని తీసి ఇచ్చానని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications