వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఫెల్.. టేకాఫ్: చైనాపై బ్రహ్మాస్త్రం: దుందుడుకు చర్యలకు చెక్: వైమానిక దళంలో.. కాస్సేపట్లో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాఫెల్.. రక్షణ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ యుద్ధ విమానాలు భారత్‌కు రాబోతోన్నాయి. ఫ్రాన్స్‌లో రూపుదిద్దుకున్న ఈ జెట్ ఫైటర్స్ కాస్సేపట్లో.. అక్కడ టేకాఫ్ తీసుకోనున్నాయి. భారత్‌కు చేరుకోనున్నాయి. తొలిదశలో అయిదు రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు పంపించడానికి ఫ్రాన్స్‌ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్దేశిత గడువు కంటే ముందే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలో చేరుకోబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Recommended Video

Rafale Fighter Jets Take Off from France To India | Oneindia Telugu

సడన్ అవుట్ బ్రేక్: చైనాలో మళ్లీ కరోనా విజృంభణ: 3 నెలల తరువాత: పెను ప్రమాదం తప్పదంటూ వార్నింగ్సడన్ అవుట్ బ్రేక్: చైనాలో మళ్లీ కరోనా విజృంభణ: 3 నెలల తరువాత: పెను ప్రమాదం తప్పదంటూ వార్నింగ్

వైమానిక దళ కమాండర్లతో ఫ్రాన్స్ రాయబారి..

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి వాయుసేనకు అభినందనలు తెలిపారు. యుద్ధ విమానాల కమాండర్లను ఆయన కలుసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు. భారత్‌లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఈ ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. భారత గగనతల రక్షణా వ్యవస్థను రాఫెల్ యుద్ధ విమానాలు మరింత బలోపేతం చేయగలవని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. వైమానిక దళంలో ప్రధాన అస్త్రంగా మారుతుందని పేర్కొంది.

దుమారం రేపిన రాఫెల్..

రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ యుద్ధ విమానాలను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డసాల్ట్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ఏ రేంజ్‌లో రాజకీయ వివాదాలు చెలరేగాయనే విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావించుకోనక్కర్లేదు. ఈ ఒప్పందాల వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఒప్పందాల్లో అనేక లోపాలు ఉన్నాయనే ఆరోపణలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. దీనిమీద సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయ

వైమానిక విన్యాసాల్లో

ఇదిలావుండగా- వైమానిక దళాధికారులు ఈ నెల 29వ తేదీన హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌లో విన్యాసాలను నిర్వహించబోతున్నారు. తాజాగా భారత్‌కు చేరుకోనున్న రాఫెల్ యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యం కాబోతున్నాయి. మొత్తం అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొనడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటిని నడిపే కమాండర్ల జాబితాను సిద్ధం చేశారు. ఇవే వైమానిక దళ విన్యాసాల్లో ఫ్రాన్స్ సహా మరికొన్ని దేశాలు భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలుస్తోంది.

English summary
Five Rafale jets taking off from France today to join the Indian Air Force fleet in Ambala in Haryana on July 29th. The aircraft will be refuelled by French Air Force tanker aircraft on their way to an airbase in the UAE before leaving for India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X