వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైకర్‌కు ఎక్స్ఈ వేరియంట్: బీఎంసీ, రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా కొత్త వేరియంట్, స్టేబుల్

|
Google Oneindia TeluguNews

ఎక్స్ఈ వేరియంట్ కరోనా వైరస్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఇదీ లండన్‌లో వెలుగుచూడగా.. ఇప్పుడు ఇండియాకు పాకింది. దీనిపై ఈ నెల 6వ తేదీన ఊహాగానాలు వచ్చాయి. అయితే కాసేపటి క్రితం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ధృవీకరించింది. దేశంలో తొలి ఎక్స్ఈ వేరియంట్ కరోనా వైరస్ వచ్చిందని తెలిపింది. ఇటు మరోవైపు గుజరాత్‌లో ఓ 60 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకిందని తెలుస్తోంది. దీనిని నిర్ధారించాల్సి ఉంది.

ముంబై శాంతా క్రూజ్ శివారుకు చెందిన 67 ఏళ్ల వ్యక్తికి ఎక్స్ఈ వేరియంట్ సోకింది. అతను ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఎక్స్ఈ వేరియంట్.. ఒమిక్రాన్ 10 రేట్ల వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే హెచ్చరిస్తోంది. సో.. మిగతా చోట్ల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అతను మార్చి 11వ తేదీన వడోదర వెళ్లారని బీఎంసీ వర్గాలు తెలిపాయి. హోటల్‌లో ఉండగా అనారోగ్యానికి గురయ్యాడు.. కానీ అతనికి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. కానీ లక్షణాలు ఏమీ కనిపించలేదు. తర్వాత అతను తిరిగి ముంబై వచ్చారు. అతని నమూనాను జినొమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా.. ఎక్స్ఈ వేరియంట్ వచ్చిందని తేలింది.

Mumbai reported its first confirmed case of the XE variant of coronavirus on Saturday BMC said.

ముంబైకర్ రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నాడని బీఎంసీ పేర్కొంది. అయితే అతనికి ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు.. ఇప్పుడు అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని బీఎంసీ తెలిపింది. సో అతని.. చుట్టూ ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త కోవిడ్ వేరియంట్ తొలుత యూకేలో వెలుగుచూసింది. సెరో సర్వే నివేదికలో XE వేరియంట్‌తో కప్పా వేరియంట్ కేసును కనుగొన్నారు.. 6వ తేదీన ప్రకటన చేశారు గానీ.. మళ్లీ ఊసే లేదు. సో ఇప్పటివరకు అయితే ఒకరికీ ఎక్స్ఈ వేరియంట్ సోకింది. గుజరాత్ వ్యక్తిని కూడా నిర్ధారించాల్సి ఉంది.

English summary
Mumbai reported its first confirmed case of the XE variant of coronavirus on Saturday BMC said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X