HMPV: భారత్ లో చైనా వైరస్ తొలి కేసు-బెంగళూరులో బాలుడికి లక్షణాలు..!

చైనాలో ప్రభావం చూపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం భారత్ పైనా మొదలైంది. మన దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసును బెంగళూరులో గుర్తించారు. నగరానికి చెందిన 8 నెలల బాలుడికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

అయితే విచిత్రంగా బాధితుడికి ఎలాంటి ప్రయాణం చేసిన చరిత్ర లేదు. దీంతో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంపిల్స్ ను ఇతర ల్యాబ్స్ కు పంపి మరోసారి పరీక్షలు చేస్తున్నారు.

first china virus HMPV case detected in bengaluru- here are details

చైనా వైరస్ హెచ్ఎంపీవీ లక్షణాలతో ఉన్న చిన్నారి ఆస్పత్రిలో చేరినట్లు ధృవీకరించిన కర్నాటక ఆరోగ్యశాఖ .. ప్రైవేట్ ల్యాబ్ పరీక్షల్లో ఇది తేలినట్లు తెలిపింది. స్వతంత్రంగా మాత్రం ప్రభుత్వ ల్యాబ్ లో ఇంకా ధృవీకరణ కాలేదు. వాస్తవానికి HMPV వైరస్ ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 0.7 శాతం ఫ్లూ కేసుల్లో ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, కర్నాటక ఆరోగ్య శాఖ అధికారులు కూడా తాజా వైరస్ పై ఎక్కువగా సమాచారం లేదని చెప్తున్నారు. చైనాలో HMPV వ్యాప్తి చెందుతుందనే ఊహాగానాల నేపథ్యంలో భారత్ లో మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇక్కడి అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందన్న ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. దీంతో కరోనా తరహాలో ఇది కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయాలు పెరుగుతున్నాయి. అయితే నేరుగా లక్షణాలు బయటపడకపోవడంతో దీనిపై కేంద్రం కూడా ఇప్పటివరకూ అధికారుల్ని అలర్ట్ మాత్రమే చేస్తోంది. ఇప్పుడు కర్నాటకలో ఓ కేసు బయటపడిన నేపథ్యంలో ఐసీఎంఆర్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+