వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపికి వ్యాపించిన ఒమిక్రాన్ - ఎన్నికల వేళ కొత్త టెన్షన్ : తొలిసారిగా రెండు కేసుల నిర్దారణ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు భారత్ లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని పైన అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ చేస్తోంది. ఇక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారి రెండు ఒమైక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగుచూశాయి.ఈ నెల29వతేదీన మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా ఒమైక్రాన్ సోకిందని ఘజియాబాద్ ఆరోగ్యశాఖాధికారులు చెప్పారు. ఇద్దరు రోగుల్లో కరోనా లక్షణాలు కనిపించలేదని, దీంతో వీరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు.

Recommended Video

Omicron Variant : Center On Booster Dose | Omicron Cases In India || Oneindia Telugu
ఇద్దరూ 60 ఏళ్లు పైబడిన వారే

ఇద్దరూ 60 ఏళ్లు పైబడిన వారే

ఒమైక్రాన్ సోకిన ఇద్దరు రోగుల వయసు 60 ఏళ్లకు పైబడిన వారుగా వెల్లడించారు. ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడటంతో ఉత్తరప్రదేశ్ సర్కారు అప్రమత్తమైంది. త్వరలో యూపిలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీతో సహా.. కాంగ్రెస్ కీలక నేతలు..ఇతర పార్టీల ముఖ్య నేతలు అనధికారికంగా ఎన్నికల ప్రచారాలు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ సమయంలో ఒమిక్రాన్ ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

అత్యవసరమైతేనే ప్రయాణాలు

అత్యవసరమైతేనే ప్రయాణాలు

ఈ సమయంలోనే కేంద్రం కీలక సూచనలు చేసింది. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.ఒమైక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. యూరప్ దేశాల్లో ఒమైక్రాన్ కేసులసంఖ్య పెరుగుతున్నందున ప్రజలు నూతన సంవత్సర వేడుకలు, పండుగలకు దూరంగా ఉండాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ సలహా ఇచ్చారు.గతంలో చూడని స్థాయిలో ఒమైక్రాన్ కేసులు వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ డీజీ చెప్పారు.

దేశ వ్యాప్తంగా 113కు చేరిన కేసుల సంఖ్య

దేశ వ్యాప్తంగా 113కు చేరిన కేసుల సంఖ్య

ఎన్నికల సమయంలో మరింతగా జన సమూహాలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో..ఎన్నికల సంఘం సైతం ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లోని పరిస్థితుల పైన ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు మహారాష్ట్ర- 40, దిల్లీ- 22, రాజస్థాన్​- 17, కర్ణాటక- 8, తెలంగాణ- 8 ,గుజరాత్​- 5, కేరళ- 7, ఆంధ్రప్రదేశ్​- 1, చంఢీగఢ్​- 1, తమిళనాడు- 1, బంగాల్​- 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్ లో నమోదైన రెండు కేసులతో దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ నిర్దారించిన వారి సంఖ్య 113 కు చేరింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ విదేశాల నుంచి వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టుల పైన అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు.

English summary
Two persons were detected with the new variant in Ghaziabad after genome sequencing in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X