నిన్న విలన్ ప్రభుత్వం, నేడు హీరో ప్రభుత్వం, టైం పాస్ సీఎం, పెత్తనం, బీజేపీ చీఫ్!
బెంగళూరు: కర్ణాటకలో ఇంతకు ముందు విలన్ ప్రభుత్వం ఉండేదని, కానీ ఇప్పుడు హీరో ప్రభుత్వం వచ్చిందని ఆరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ నళిన్ కుమార్ కటీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు టైం పాస్ సీఎం ఉన్నారని, పెత్తనం మాత్రం వేరేవాళ్లు చేశారని నళిన్ కుమార్ కటీల్ ఆరోపించారు. హిందూ కార్యకర్తలు దారుణ హత్యకు గురైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమాజాన్ని ఒక్కటి చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ నళిల్ కుమార్ కటీల్ అన్నారు.

పార్ట్ టైం సీఎం
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హెచ్.డీ. కుమారస్వామి పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన ఒక పార్ట్ టైం సీఎం అని బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ఆరోపించారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, డీకే. శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య సంకీర్ణ ప్రభుత్వంలో పెత్తనం చేశారని, కుమారస్వామి మాత్రం సైడ్ ఆక్టర్ గా మిగిలిపోయారని బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ వ్యాంగంగా అన్నారు.

ఈ రోజు హీరో ప్రభుత్వం
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సమయంలో విలన్ ప్రభుత్వం ఉండేదని, బీఎస్. యడియూరప్ప సీఎం అయిన తరువాత హీరో ప్రభుత్వం వచ్చిందని నళిన్ కుమార్ కటీల్ అన్నారు. కుమారస్వామి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వరదలు వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, యడియూరప్ప ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరదలు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, ప్రజలు కష్టాలు తీర్చారని, ఇల్లు కొల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఇస్తామని యడియూరప్ప హామీ ఇచ్చారని, ఇదే విలన్ ప్రభుత్వానికి, హీరో ప్రభుత్వానికి తేడా అని బీజేపీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ అన్నారు.

కల్యాణ కర్ణాటక లక్షం
కర్ణాటకలో బీజేపీని మరింత అభివృద్ది చేస్తామని నళిని కుమార్ కటీల్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 150 నియోజక వర్గాల్లో విజయం సాధిస్తుందని నళిన్ కుమార్ కటీల్ జోస్యం చెప్పారు. కర్ణాటకను కల్యాణ కర్ణాటక చెయ్యడం బీజేపీ లక్షం అని నళిన్ కుమార్ కటీల్ అన్నారు.

సిద్దూ దెబ్బకు డీకే అరెస్టు
డీకే. శివకుమార్ మీద ఈడీ అధికారులు కేసు నమోదు చెయ్యడం వెనుక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హస్తం ఉందని నళిన్ కుమార్ కటీల్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో డీకే. శివకుమార్ తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న విషయం సిద్దరామయ్య జీర్ణించుకోలేక ఆయన్ను కేసుల్లో ఇరికించారని నళిన్ కుమార్ కటీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్వేష రాజకీయాలు చేస్తున్నది బీజేపీ కాదని, సిద్దరామయ్య అని నళిన్ కుమార్ కటీల్ మండిపడ్డారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications