నదిలో గల్లంతు: ఐదు మంది యువకుల జలసమాధి, స్నేహితులతో కలిసి వెళ్లారు, చివరికి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: స్నేహితులతో మాట్లాడి వస్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఐదు మంది యువకులు నదిలో మునిగి జలసమాధి అయిన ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాళ తాలుకాలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు.

మరో నలుగురి మృతదేహాల కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాళ తాలుకా మూలరపట్టె గ్రామంలో నివాసం ఉంటున్న అస్లామ్ (17), రమూజ్ (17), అజామత్ (18), ముబాశిర్ (17), సమాద్ (17) సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

Five children drowned in Falguni river Bantwala in Karnataka

రాత్రి పోద్దుపోయినా ఐదు మంది వారి ఇళ్లకు వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఐదు మంది కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. గ్రామం సమీపంలోని పాల్గణి నది సమీపంలో ఐదు మంది యువకుల దుస్తులు కనిపించాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నదిలో ఐదు మంది యువకుల ఆచూకి కోసం గాలించారు. మంగళవారం ఉదయం సమాద్ మృతదేహాన్ని గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మిగిలిన నలుగురు యువకుల మృతదేహాల కోసం పాల్గణి నదిలో గాలిస్తున్నారు. నదిలో ఈత కొట్టడానికి ప్రయత్నించి ఐదు మంది జలసమాధి అయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
5 children died after drown into water in Falguni river in Mularapatna, Bantwala taluk. One children dead body are found on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి