టైరు పేలి..లారీని ఢీ కొట్టి..!
ధర్వాడ: కర్ణాటకలోని ధార్వాడలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ధర్వాడ జిల్లా నవలగుందె తాలూకా పరిధిలోని అమరగూళ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
బాగలకోటె జిల్లా కవలపేటెకు చెందిన రవి హండి, లేఖాశ్రీ హండి, నవీన్‌కుమార్ హండి, శరణ, వర్షా జిగజిన్ని ఆదివారం ఉదయం కారులో ధార్వాడకు బయలుదేరారు. మార్గమధ్యలోనవలగుందె-నరగుందె గ్రామాల మధ్య రహదారిపై కారు టైరు పేలిపోయింది.

ఫలితంగా- కారు అదుపు తప్పింది. ఎదురుగా వస్తోన్న లారీని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు సంఘటనాస్థలంలోనే మరణించారు. మరో ఇద్దరిని ఆసుప్రతికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. కారు ముందు భాగం మొత్తం తునాతునకలైంది.

ఈ సమాచారం అందుకున్న వెంటనే నవలగుందె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం చోటు చేసుకున్న విషయాన్ని మృతుల కుటుంబీకులకు తెలియజేశారు. బాగల్‌కోటె జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ జిగజిన్నికి సమీప బంధువులగా గుర్తించారు.












Click it and Unblock the Notifications