Power: ఐదు రాష్ట్రాల్లో కాదు ఒక్కచోటే ఓడిపోయామని అంటున్న మాజీ సీఎం, ఇదేం లెక్క సిద్దూ సార్ !
బెంగళూరు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఎలా తప్పించుకోవాలి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక దారులు వెతుక్కుంటున్నారు. ఇతరులతో పొత్తు పెట్టుకోవడం వలనే మేము ఓడిపోయామని ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటూ తిరిగేశారు. అయితే ఒంటరిగా పోటీ చేసిన ఎందుకు ఓడిపోయారు అంటూ పక్కనోళ్ల మీద ఆ నింద తోసేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయంలో ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల నాయకులు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది ?, అసలు ఏం జరిగింది ? అనే విషయం మేము ఆత్మపరిశీలన చేసుకుంటున్నామని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అంటున్నారు.
ఐదు రాష్ట్రాల ఫలితాల ఎఫెక్ట్ కర్ణాటక మీదపడదని, మాకు కర్ణాటకలోని మా ఓటు బ్యాంకు చెక్కుచెదరదని మాజీ సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో మతతత్వ పార్టీ బీజేపీ విజయం సాధించడంతో అక్కడి ఓ వర్గంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అయితే ప్రజాతీర్పును అందరూ గౌరవించాలని సిద్దరామయ్య అన్నారు. మేము ఓడిపోయింది పంజాబ్ లో మాత్రమే అని సిద్దరామయ్య అంటున్నారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల గురించి సిద్దరామయ్య మాట దాటేస్తున్నారు.

చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కు అలవాటు
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఎలా తప్పించుకోవాలి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక దారులు వెతుక్కుంటున్నారు. ఇతరులతో పొత్తు పెట్టుకోవడం వలనే మేము ఓడిపోయామని ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటూ తిరిగేశారు. ఏ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తప్పు వాళ్లది అని అంగీకరించలేదని ఆ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఐదు రాష్ట్రాల దెబ్బతో ?
ఒంటరిగా పోటీ చేసిన ఎందుకు ఓడిపోయారు అంటూ పక్కనోళ్ల మీద ఆ నింద తోసేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయంలో ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల నాయకులు స్పందిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్పాలి అనే విషయం అంతుచిక్కక సతమతం అవుతున్నారు.

ఉత్తరప్రదేశ్ ఫలితాలపై సిద్దూ షాకింగ్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది ?, అసలు ఏం జరిగింది ? అనే విషయం మేము ఆత్మపరిశీలన చేసుకుంటున్నామని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాల ఎఫెక్ట్ కర్ణాటక మీదపడదని, మాకు కర్ణాటకలోని మా ఓటు బ్యాంకు చెక్కుచెదరదని మాజీ సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదేమి లెక్కలు సిద్దూ సార్ ?
ఉత్తరప్రదేశ్ లో మతతత్వ పార్టీ బీజేపీ విజయం సాధించడంతో అక్కడి ఓ వర్గంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అయితే ప్రజాతీర్పును అందరూ గౌరవించాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలోని శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్ ఓడిపోయింది పంజాబ్ లో మాత్రమే అని, మిగిత రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉందని సిద్దరామయ్య అన్నారు. అయితే కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది అనే విషయంలో సిద్దరామయ్య క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications