ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కోవిడ్ ఆంక్షలు కొంత అడ్డంకిగా మారినప్పటికీ- నియోజకవర్గ స్థాయిలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ పరిస్థితుల మధ్య అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల కానుంది.
దీనికోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర, కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. అయిదు రాష్ట్రాల్లో విడతలవారీగా పోలింగ్‌ను నిర్వహించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోనుంది. కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య పోలింగ్ నిర్వహించేలా అన్ని జాగ్రత్తలను తీసుకుంటుంది. ఈ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ మీకోసం.. లైవ్ ద్వారా

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్
Uttar Pradesh to go to poll in 7 phases from 10th Feb to 7th March; Punjab, Uttarakhand and Goa to vote on 14th February & Manipur to vote on 27th Feb & 3 March; Counting of votes on 10th March: ECI pic.twitter.com/hxKms5e8hi
— ANI (@ANI) January 8, 2022












Click it and Unblock the Notifications