విమానం పక్కనే అన్నం తిన్నారు..!
ఇండిగో(IndiGo) సంస్థకు, ముంబయి విమానాశ్రయానికి(Mumbai Airport) పౌర విమానయాన శాఖ నోటీసులు జారీచేసింది. దీనికి కారణం.. విమానం పక్కనే కొంతమంది ప్రయాణికులు నేలపై కూర్చొని ఆహారం తీసుకోవడమే. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ముంబయి ఎయిర్ పోర్టు, ఇండిగో.. ఈ రెండు సంస్థలు పరిస్థితులను అంచనా వేయలేకపోయానని, ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేకపోయిందని ఆక్షేపించింది. గడువులోగా సమాధానం ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఉత్తర భారతదేశంలో పొగమంచు ఏర్పడటంవల్ల భారీ సంఖ్యలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల విమానాలు చాలా ఆలస్యంగా నడిచాయి. అంతేకాదు.. గంటల తరబడి వాటికోసం ఎదురుచూడాల్సి వచ్చింది. గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబయి విమానాశ్రయంలో ఆగింది. అప్పటికే ఆలస్యం కావడంతో కొందరు ప్యాసింజర్లు కిందకు దిగి, నేలపై కూర్చొని భోజనం చేశారు. దీనిపై విమానయానశాఖ తీవ్రంగా స్పందించింది.

వాస్తవానికి విమానాలు రెండురోజుల నుంచి తీవ్ర ఆలస్యంతో నడుస్తున్నాయి. ఒక ప్రయాణికుడైతే పైలట్ పై దాడికి దిగాడు. ఇటువంటి పరిస్థితులను సరిజేసేందుకు విమానాయాన సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పొగమంచు వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో అసలు ఏమీ కనపడటంలేదు. ప్రతికూల వాతావరణంతో విమానాలన్నీ రద్దయ్యాయి.. లేదంటే ఆలస్యంగా నడిచాయి. దీనిపై ఎయిర్ లైన్స్ కు మార్గదర్శకాలు జారీచేస్తామని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. అందుకు ప్రయాణికులంతా సహకరించాలని కోరారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వమించారు.












Click it and Unblock the Notifications