ప్రత్యేక రైళ్లు, వందే భారత్, అదనపు బోగీలు: హైదరాబాద్, చర్లపల్లి నుంచీ ..!!
దేశంలో అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్లు నేడు కూడా రద్దయ్యాయి. 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 550కి పైగా విమానాలను రద్దు చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంతరాయం వేలాది మంది ప్రయాణికులను గంటల తరబడి ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు పడేలా చేసింది. అక్కడే చిక్కుకుపోయేలా చేసింది. ఇండిగో విమాన ప్రయాణికులు నరకం చవి చూస్తోన్నారు.
ఈ పరిణామాలతో రైళ్లకు ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడానికి రైల్వే జోన్లు విస్తృత చర్యలు తీసుకున్నాయి. మొత్తం 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లను జోడించాయి. 114 అదనపు ట్రిప్పులను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్- లోకమాన్య తిలక్ టెర్మినస్ ముంబై, చెన్నై ఎగ్మూర్- చర్లపల్లి మధ్య ఇవి రాకపోకలు సాగిస్తాయి. నంబర్ 07150 ప్రత్యేక రైలు నేటి రాత్రి 8:25 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబై ఎల్టీటీ చేరుకుంటుంది.
- నేటి రాత్రి 11:55 నిమిషాలకు చెన్నై ఎగ్మూర్ నుంచి బయలుదేరే నంబర్ 06019 ప్రత్యేక రైలు ఆదివారం సాయంత్రం చర్లపల్లికి చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 11:38 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06020 ప్రత్యేక రైలు మరుసటి చెన్నై ఎగ్మూర్ చేరుకుంటుంది.
- ఇందులో దక్షిణ రైల్వే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 18 రైళ్లలో చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్‌లను అదనంగా చేర్చింది.
- నార్తరన్ రైల్వేలో ఎనిమిది రైళ్లకు 3- ఏసీ, చైర్ కార్ కోచ్‌లు అమర్చారు.
- పశ్చిమ రైల్వే పరిధిలో నాలుగు అత్యంత రద్దీగల రైళ్లకు 3- ఏసీ, 2-ఏసీ కోచ్‌లను అదనంగా ఏర్పాటు చేశారు.
- తూర్పు మధ్య రైల్వే పరిధిలో నంబర్ 12309 రాజేంద్రనగర్- న్యూఢిల్లీ ఎక్స్ ప్రెస్ కు అదనపు 2ఏసీ కోచ్‌లను కేటాయించారు. నేటి నుంచి 10వ తేదీ వరకు అయిదు ట్రిప్పుల పాటు ఈ అదనపు కోచ్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
- ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలోని నంబర్ 20817/20811/20823 భువనేశ్వర్-న్యూఢిల్లీ మధ్య నడిచే రైళ్లకు అయిదు ట్రిప్పుల కోసం 2ఏసీ కోచ్‌లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
- తూర్పు రైల్వేలో మూడు రైళ్లకు స్లీపర్ క్లాస్ కోచ్‌లను అదనంగా అమర్చారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆరు ట్రిప్పుల పాటు అదనపు బోగీలు అందుబాటులో ఉంటాయి.
- నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే రెండు రైళ్లకు 3ఏసీ, స్లీపర్ కోచ్‌లను జోడించారు. ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు ఎనిమిది ట్రిప్పుల పాటు నడుస్తుంది.
ప్రత్యేక రైళ్లు ఇవీ..
అదనపు బోగీలను అమర్చడంతో పాటు వివిధ రద్దీ మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను కూడా ఆయా జోన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో 05591/05592 గోరఖ్‌పూర్- ఆనంద్ విహార్ టెర్మినల్ ప్రత్యేక రైలు ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నాలుగు ట్రిప్పుల మేర రాకపోకలు సాగిస్తుంది. అలాగే.. న్యూఢిల్లీ - కేప్టెన్ తుషార్ మహాజన్ ఉధంపూర్ మధ్య 02439/02440 వందే భారత్ స్పెషల్ రైలు అందుబాటులోకి వచ్చింది. నేడు 04002/04001 న్యూఢిల్లీ- ముంబై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ నేడు, రేపు రాకపోకలు సాగిస్తుంది. 04080 హజ్రత్ నిజాముద్దీన్- తిరువనంతపురం సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తుంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications