వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ ఈమెయిల్ హ్యాక్: అర కోటి డిమాండ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: భారత్‌ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపక సీఈఓ బిన్నీ బన్సల్ ఈమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు 80వేల డాలర్లు (సుమారు రూ.50 లక్షలు) డిమాండ్ చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ సీఎఫ్ఓ పోలీసులకు వెల్లడించారు.

బన్సల్ ఈమెయిల్‌ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు సీఈఓ మెయిల్ నుంచి ఫ్లిప్‌కార్ట్ సీఎఫ్ఓ‌కు రెండు మెయిల్స్ పంపారు. అంతేకాదు వెంటనే డబ్బును తమ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో హ్యాకర్లపై బన్సల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న బెంగులూరు సైబర్ క్రైమ్ పోలీసులు దీనిని ఈమెయిల్ స్పూఫింగ్‌గా పేర్కొన్నారు. రష్యాలోని సర్వర్లను వాడుకున్న హ్యాకర్లు, హాంకాంగ్, కెనడాల్లోని ఐపీ అడ్రస్‌ల ద్వారా మెయిల్ ఐడీని హ్యాక్ చేశారని గుర్తించారు.

Flipkart CEO Binny Bansal's email hacked, $80,000 sought

కాగా, సీఎఫ్ఓ సంజయ్ బవేజాకు మార్చి 1న ఉదయం 11:33కు ఈ ఈ మెయిల్స్ వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వెంటనే ఆశ్చర్యపోయిన బెవాజా, బన్సాల్‌ను సంప్రదించి మెయిల్ హ్యాక్ అయినట్టు గుర్తించారు. బన్సల్ తరుపున ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఉద్యోగి ఎస్ఎన్ శివగంగయ్య బెంగుళూరు సైబర్ క్రైమ్ సెల్‌లో బుధవారం ఫిర్యాదు చేశారని సీఐడీ అధికారులు తెలిపారు.

రష్యాలోని సర్వర్లను ఉపయోగించి ఒకే సమయంలో రెండు ఈమెయిల్స్‌ను పంపినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

English summary
E-commerce major Flipkart has lodged a police complaint that its CEO Binny Bansal's official email account was hacked and two mails were sent from it to the company's CFO asking for transfer of $80,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X