వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాపింగ్ ప్రియులకు శుభవార్త! ఇప్పుడు డెబిట్ కార్డుపైనా ఈఎంఐ.. ఫ్లిప్‌కార్ట్‌ లో!

కొనుగోలుదారులకు ఫ్లిప్‌కార్ట్‌ ఓ సరికొత్త అవకాశం కల్పిస్తోంది. ఇక నుంచి డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి కూడా ఈఎంఐ సౌకర్యం కల్పించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కొనుగోలుదారులకు ఫ్లిప్‌కార్ట్‌ ఓ సరికొత్త అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు పలు సంస్థలు తమ ఉత్పత్తులను క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసేవారికి ఈఎంఐ సౌకర్యం కల్పించడం తెలుసు. ఇక నుంచి డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి కూడా ఈఎంఐ సౌకర్యం కల్పించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇప్పటి వరకు ఆన్ లైన్ లో షాపింగ్ చేయాలంటే క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం అన్ని సంస్థలూ అందుబాటులోకి తీసుకురావడం లేదు. దీంతో ఆన్ లైన్ కొనుగోళ్లకు ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు తప్పనిసరిగా మారింది.

flipkart

కానీ ఇకమీదట ఈ పరిస్థితి మారబోతోంది. ఎందుకంటే.. ఇది పోటీ ప్రపంచం. విక్రయాలను పెంచుకునేందుకు ఒక్కో సంస్థ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటోంది. ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఇప్పుడు వినూత్న పంథాలో పయనిస్తోంది.

తన వార్షిక బిగ్‌ బిలియన్‌ డేస్‌ సందర్భంగా కొనుగోలుదారులకు ఈ అవకాశం ఇవ్వనుంది. దీని వల్ల సంస్థ ఆదాయంతోపాటు అమ్మకాలూ పెరుగుతాయని ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఈ డెబిట్ కార్డుపై ఈఎంఐ ఆఫర్‌ను అందరూ పొందలేరు. వినియోగదారుల ఇంటర్నల్‌ డేటా ఆధారంగా ఫ్లిప్‌కార్ట్‌ కొంతమంది వినియోగదారులను ఎంపిక చేస్తుంది. ఈ సేవలను ప్రారంభించే క్రమంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌లతో కలిసి ఫ్లిప్‌కార్ట్‌ పనిచేయనుంది.

తొలుత ప్రయోగాత్మకంగా భారీ విలువ కలిగిన గృహోపకరణాలకు వర్తింపజేసి, అనంతరం మిగతా కేటగిరీలకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

'వినియోగదారుల గత కొనుగోలు తీరును, ఇతర వివరాలను పరిశీలించిన అనంతరం కొంతమందికి వారి డెబిట్‌ కార్టులపై ఈఎంఐ సౌకర్యం కల్పిస్తాం..' అని ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన సందీప్‌ కర్వా తెలిపారు.

ఇటువంటి వారికి అధిక విలువ కలిగిన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి క్రెడిట్‌ కార్డు పరిధి సరిపోదని, అందుకే కొత్త సేవలను ప్రారంభించనున్నట్లు వివరించారు. దీని వల్ల భారీ ధర కలిగిన వస్తువులను కొనుక్కునేందుకు ముందుకు వస్తారని, సంస్థ అమ్మకాలు పెరుగుతాయన్నారు. ఇంకేం మరి, మీ డెబిట్ కార్డుతో రెడీ అయిపోండి.. బిగ్ బిలియన్ డేస్ కోసం!

English summary
Indian major e-tailer Flipkart will soon avail EMI (Equated Monthly Installment) for debit card holders, which is expected to work during its flagship event Big Billion Days (BBD) sale in October. The online shopping major has tied up with SBI and Axis bank as a pilot project. As of now, EMI option, which is available across all big e-commerce sites, is limited to credit card users. The addition of debit card users for EMI is going to soar up the revenue and number of shoppers on the platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X