వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో వరదలు భారీ విధ్వంసం సృష్టించంతో ఆ రాష్ట్ర జన జీవనానికి పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అక్కడ ఆహార రవాణతో పాటు, విద్యుత్ వ్యవస్ద పూర్తిగా దెబ్బతింది. దీంతో వరదల్లో చిక్కుకున్న తమను ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర నిప్రృహతో స్పందించారు.

ఎన్టీటీవీకిచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ "అసలు నా ప్రభుత్వం ఎక్కడుంది" అని ఎదురు ప్రశ్నించారు. తన సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ కంట్రోల్ రూం, అగ్నిమాపక శాఖ అన్నీ నీటమునిగాయన్నారు. గెస్ట్ హౌస్‌లో ఆరుగురు వ్యక్తులతో తాను పనిచేయడం ప్రారంభించానని, తన సెల్ ఫోన్ ఛార్జింగ్, కనెక్టివిటీ పోయాయని, ఎవరితోనూ కమ్యూనికేట్ చేసే పరిస్దితి లేదని అన్నారు.

ప్రభుత్వపు మంత్రులు, అధికారులు ఆచూకీ తెలియదన్నారు. వరదల్లో చిక్కుకుపోయిన కొందరు మంత్రుల్ని నిన్ననే కలిశానని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. వరదల్లో చిక్కుకుపోయిన వారికోసం సైన్యం చేసిన సహాయక చర్యలను కొనియాడారు. తన ప్రభుత్వం సహాయం చేయలేని పరిస్దితిలో ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్దితుల్లో సైన్యం గొప్ప సాయం చేసిందని ఒమర్ పేర్కొన్నారు.

బుధవారం వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సైపుద్దీన్ సోజ్‌ను 'గో బ్యాక్' నినాదాలతో అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. 60 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా కనివినీ ఎరుగని రీతిలో జమ్మూ కాశ్మీర్‌ను వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకూ 215 మంది చనిపోగా... లక్షలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.

జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది, అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఒకరోజు వేతనాన్ని స్వచ్చందంగా ప్రధాన మంత్రి జాతీయ సాహయ నిధికి అప్పగించాలని సిబ్బంది, అధికారులు నిర్ణయించినట్లు పిఎంఓ గురవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

 అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

పంచవతి గ్రామంలో కూలిపోయిన ఇంటి క్రింద ఎవరైనా మిగిలిఉన్నారేమోనని కుక్క సహాయం తీసుకుంటున్న ఆర్మీ జవాను.

 అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

ఉదంపూర్ జిల్లాలోని పంచవతి గ్రామంలో కూలిపోయిన ఇంటి క్రింద బంధువులు ఎవరైనా మిగిలి ఉన్నారేమోనని ఆశగా చూస్తున్న ఓ బాధితుడు.

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

వరదల కారణంగా జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాల ఎరియల్ వ్యూ.

 అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

భారీగా వరదలు కారణంగా చెల్లాచెదురైన ఇళ్లు.

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

వరదల కారణంగా జమ్మూ కాశ్మీర్ హమిర్ పుర్ ప్రాంతంలో కొట్టుకుపోయిన ముళ్లకంచెను పునర్మిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్.

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

బనిలాల్ ప్రాంతంలో ఆహార పొట్లాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వరద బాధితులు.

 అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ వరదల కారణంగా అక్కడి ప్రజలు బాగోగులు చూడాలంటూ ఎమర్జెన్సీ మీటింగ్‌ను ఏర్పాుటు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ వరదల కారణంగా తావి నదిపై కూలిపోయిన భాగ్వతి నగర్ బ్రిడ్జిని పరిశీలిస్తున్న మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, కాంగ్రెస్ లీడర్ గులాం నబీ ఆజాద్.

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

ఉదంపూర్ జిల్లాలోని పుంజర్ సద్దాల్ గ్రామంలో డేరాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆశ్రయాన్ని కల్పించిన సైన్యం.

జమ్మూ కాశ్మీర్ వరదల కారణంగా నిరాశ్రయులైన జనాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా.

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న బాధితుల బంధువులు.

 అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

అసలు నా ప్రభుత్వం ఎక్కడుందన్న సీఎం ఓమర్ అబ్దుల్లా

వరదల కారణంగా మట్టిలో చిక్కుకుపోయిన తన కుట్టుమిషన్‌ని శుభ్రం చేస్తున్న ఓ మహిళ.

English summary
"I had no government as the seat of the establishment was wiped out by the worst floods in over a century," Jammu & Kashmir chief minister Omar Abdullah said on Thursday, recalling the nightmare of the disaster that hit his state six days back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X