భజరంగ్ దళ్ నేత హత్య: 8 మంది అరెస్టు
మంగళూరు: భజరంగ్ దళ్ నేత హత్య కేసులో కర్ణాటక పోలీసులు 8 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఆరు మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని మూడబిదరిలో అరెస్టు చేశారు.
మూడబిదరికి చెందిన ప్రశాంత్ పూజారీ భజరంగ్ దళ్ నేత. ఇతను అదే ప్రాంతంలో పూల వ్యాపారం చేస్తున్నాడు. అక్టోబర్ 9వ తేదిన ఉదయం ప్రశాంత్ పూజారీని అతి దారుణంగా వేటకోడవళ్లతో నరికి చంపేశారు. హంతకులను అరెస్టు చెయ్యాలని హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు

ఈ హత్య కేసు దర్యాప్తు చేసిన పోలీసులు మహమ్మద్ షరీఫ్ (42), ముస్తఫా కావూరు (28), మహమ్మద్ ముస్తఫా (25), షబీర్ (28), మహమ్మద్ హనీఫ్ (36), ఇబ్రహీం లియాకత్ (26), మహమ్మద్ ఇల్వాస్ (27), అబ్దుల్ రషీద్ (39) అనే నిందితులను అరెస్టు చేశారు.
ప్రశాంత్ పూజారీ హిందూ సంఘ, సంస్థలు నిర్వహించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గోంటున్నాడు. ఇతను ఆ పరిసర ప్రాంతాలలోని గోమాంసం దుకాణాలు మూసివేయించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇదే విషయం పై కక్ష పెంచుకున్న నిందితులు ప్రశాంత్ పూజారీని హత్య చేశారని మంగళూరు నగర పోలీసు కమిషనర్ మురుగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications