వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెల్టా వేరియంట్‌కు వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తక్కువ ఉంటేనే ప్రయోజనం: లాన్సెట్ స్టడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ స్ట్రెయిన్ డెల్టా వేరియంట్‌పై కరోనావైరస్ ఒరిజినల్ వేరియంట్ కన్నా తక్కువ ప్రభావం చూపుతోందని లాన్సెట్ జర్నల్ కొత్త అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్ సోకినవారికి వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి ఎక్కువ ఉంటే యాంటీబాడీలు తగ్గిపోయే అకాశం ఉందని వెల్లడించింది.

Recommended Video

Vaccination Boost Natural Immunity దీర్ఘకాలం పాటు మనిషి శరీరంలో | COVID 19 Study || Oneindia Telugu

కరోనావైరస్ సోకినవారికి ఫైజర్ సింగిల్ డోసు ఇస్తే 79 శాతం మందిలో యాంటీబాడీలు తటస్థీకరించబడ్డాయి. అదే బీ.1.1.7 లేదా ఆల్ఫా వేరియంట్ సోకిన్ వారికి ఈ వ్యాక్సిన్ ఇస్తే వారిలో స్పందన 50శాతం యాంటీబాడీలకు పడిపోయింది. ఇక డెల్టా వేరియంట్ సోకిన వారికి 32 శాతం, బీ.1.351 లేదా బెటా వేరియంట్(దక్షిణాఫ్రికాలో గుర్తించినది)పై 25 శాతంకు పడిపోయింది.

 For Delta Variant, Need Shorter Gap Between Vaccine Doses: Lancet Study

అయితే, వ్యాక్సిన్ తీసుకున్న కరోనా బాధితులకు రక్షణ లభిస్తోందని, చాలా మంది ఆస్పత్రికి దూరంగా ఉండేలా చేస్తోందని అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. కొత్త వేరియంట్ల బారిన పడిన తక్కువ ఇమ్యూనిటీ ఉన్నవారికి వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి ఎక్కువ ఉండకుండా చూడటం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని యూసీఎల్‌హెచ్ ఇన్ఫెక్టియిస్ డిసీజెస్ కన్సల్టెంట్ అండ్ సీనియర్ క్లినికల్ రీసెర్చ్ ఫెలో ఫర్ ది లెగసీ స్టడీ ఎమ్మా వాల్ తెలిపారు.

భారతదేశంలో కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని 8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచిన నేపథ్యంలో ఫైజర్ డోసుల విషయంలో ఈ మేరకు పరిశోధన తేల్చడం గమనార్హం. అయితే, గడువు పెంచడం ద్వారా వ్యాక్సిన్ డోసుల సామర్థ్యం మరింతగా పెరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.

యూకేలో 12 వారాల విరామాల మధ్య రెండు డోసులు ఇవ్వడం వల్ల 81.3 శాతం వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆరు వారాల్లోపు రెండు వ్యాక్సిన్ డోసులను ఇవ్వడం వల్ల 55.1 శాతమే సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. అయితే, తాజా స్టడీ డెల్టా వేరియంట్ పైనే గాక, ఇతర వేరియంట్ల గురించి కూడా జరిపింది. యూకేలో కూడా రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని ఈ స్టడీ సూచించింది. అలా అయితేనే ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అన్ని వేరియంట్లపైనా సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని పేర్కొంది. డెల్టా వేరియంట్లపై ఫైజర్ వ్యాక్సిన్.. ఫీవర్ యాంటీబాడీలు ఐదు రేట్లు పెంచేలా పనిచేస్తున్నాయని తెలిపింది.

English summary
The Pfizer vaccine is far less effective against the Delta variant of Covid, which is dominant in India, compared to the original strain of the coronavirus, says The Lancet journal in a new study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X