తెగించిన లిక్కర్ మాఫియా: రాడ్లతో మహిళపై దాడి.. సిగ్గుచేటన్న కేజ్రీవాల్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: లిక్కర్‌ మాఫియా సమాచారం లీక్ చేసిందన్న సమాచారంతో ఓ మహిళపై దాడి చేసి ఆమెను నగ్నంగా ఊరేగించిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని పోలీస్ చౌకీ సమీపంలో నివసించే ప్రవీణ్(33) అనే మహిళ.. నారెళ్ల ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి గురించి బుధవారం రాత్రి ఢిల్లీ మహిళా కమీషన్‌కు సమాచారం అందించింది. దీంతో అక్రమ మద్యం విక్రయ స్థావరాలపై మహిళా కమీషన్ దాడులు నిర్వహించింది.

For helping DCW bust liquor den, woman beaten with rods, her clothes torn

ఈ దాడుల్లో సుమారు 350మద్యం బాటిల్స్ ను కమీషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా కమీషన్ దాడులతో ఆగ్రహించిన అక్రమ వ్యాపారులు ప్రవీణ్‌ ఇంటిని చుట్టుముట్టారు. ఆశ, సన్సి అనే ఇద్దరు మహిళలు ప్రవీణ్‌పై గురువారం ప్రవీణ్ పై రాడ్లతో దాడి చేశారు.

ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. దాడికి పాల్పడ్డవారిపై ఐపీసీ సెక్షన్స్ 323/342/354/354B/506/509/34 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే బాధిత మహిళను నగ్నంగా ఊరేగించలేదని, దాడి జరిగిన సమయంలో ఆమె బట్టలు చిరిగిపోయాయని తెలిపారు.

సిగ్గుచేటు అన్న సీఎం కేజ్రీవాల్:

మహిళపై మద్యం మాఫియా దాడిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి.. స్పందించని పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతానని ఆయన చెప్పారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 33-year-old woman was beaten up with rods by a mob in Narela on Thursday, after she accompanied the Delhi Commission for Women chief and her team on a liquor raid in outer Delhi on Wednesday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X