Forbes richest List 2024: టాప్ లో ముఖేష్ అంబానీ; అదానీ స్థానం ఎంతంటే!!
ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజాగా తన వరల్డ్ బిలియనీర్ల జాబితా 2024ను విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ 2024 ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం 100 మంది సంపన్నుల జాబితాలో 116 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఆయన టాప్ లో నిలిచారు. ఈ ఏడాది కూడా ఆయనే ప్రధమ స్థానాన్ని తిరిగి సంపాదించుకున్నారు.
ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ల జాబితా ప్రకారం భారతీయుల సంపద
ఇక ఇందులో 200 మంది భారతీయులు పాల్గొనగా, వీరందరి సంపద అక్షరాల 954 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. 2023 సంవత్సరంలో 169 మంది బిలియనీర్లు ఫోర్బ్స్ జాబితాలో ఉండగా, అప్పుడు వారి సంపద 675 బిలియన్ డాలర్లు. ఇక ఈ సంవత్సరం ఏకంగా 41 శాతం పెరిగి భారతీయ బిలియనీర్ల సంపద 954 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

భారతీయ సంపన్నులలో ముకేష్ అంబానీ టాప్
తాజా ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ల జాబితాలో ఉన్న భారతీయులలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, భారతదేశ అపర కుబేరుడు ముకేశ్ అంబానీ 116 బిలియన్ డాలర్లను నికర సంపదతో భారతీయ సంపన్నుల జాబితాలో టాప్ వన్ గా నిలిచారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరుల లో ఆయన 9వ స్థానంలో నిలిచారు. 100 బిలియన్ డాలర్ల క్లబ్లో స్థానం పొందిన మొదటి భారతీయుడిగా ముఖేష్ అంబానీ రికార్డు సృష్టించారు.
టాప్ 2 లో నిలిచిన గౌతమ్ అదానీ, మూడో స్థానంలో శివ్ నాడార్
ఇక ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో భారతీయ సంపన్నుల లో రెండవ స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన 84 బిలియన్ డాలర్ల నికర సంపదతో భారతదేశంలోని అత్యంత సంపన్నుల లో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఆ తరువాత మూడవ స్థానంలో శివ్ నాడార్ నిలిచారు. ఆస్తుల నికర విలువ 36.9 బిలియన్ డాలర్లు.
అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్
నాలుగవ స్థానంలో సావిత్రి జిందాల్ 33.5 బిలియన్ డాలర్ల నికర విలువతో అత్యంత సంపన్న మహిళగా ఆవిర్భవించారు. గత సంవత్సరం ఆమె ఆరవ స్థానంలో ఉండగా, ఆమె నాలుగవ స్థానానికి చేరుకున్నారు. ఫోర్బ్స్ 2024 సంపన్నుల జాబితాలో దిలీప్ సంఘ్వీ, వైరస్ పూనవాలా, కుశాల్ పాల్ సింగ్, కుమార్ బిల్లా, రాధా కిషన్ దమాని, లక్ష్మీ మిట్టల్, నరేష్ టెహ్రాన్, రమేష్ కున్హి కన్నన్, రేణుక జగ్తియాని వంటి ప్రముఖులు ఉన్నారు.












Click it and Unblock the Notifications