చైనా ఎఫెక్ట్: భారత రక్షణ రంగానికి రూ. 27 లక్షల కోట్లు?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్ళలో భారత రక్షణ రంగానికి ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను కేటాయించాలని కోరింది. చైనా, పాకిస్తాన్ నుండి పొంచిఉన్న ముప్పు దృష్ట్యా ఈ మేరకు ప్రతిపాదనలను పంపింది రక్షణశాఖ.

అవసరమైన ఆయుధాల కొనుగోలు కోసం ఏకీకృత రక్షణ పథకం కింద 2017-22 నాటికి రూ. 26.94 లక్షల కోట్ల రూపాయాల కేటాయించాలని రక్షణశాఖ కేంద్రాన్ని కోరింది.

Forces seek Rs 27 lakh crore over next 5 years for defence projects

ఇందులో భాగంగా డిఆర్డిఓతో సహ వివిధ రంగాలకు చెందిన అధిపతులు జూలై 10, 11తేదిల్లో జరిగిన యూనిఫైడ్ కమాండర్స్ సమావేశంలో 13వ, పంచవర్షప్రణాళిక సంఘానికి నివేదికను సమర్పించారు.

సిక్కిం భూటాన్ టిబెట్ సరిహద్దు సమీపంలో భారత్ చైనా బలగాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, నియంత్రణ రేఖల వద్ద పాక్ జరుపుతున్న రోజువారీ కాల్పులకు చెక్ పెట్టేందుక రక్షణరంగం వ్యయాన్ని పెంచాలని ఆ శాఖాధికారులు కోరారు.

భద్రతా దళాల ఆదునీకీకరణకు సరైన ప్రాధాన్యత ఉంటుందని సైనిక దళాలకు, హమీ ఇచ్చారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ. 2017-18 లో రక్షణ బడ్జెట్ రూ. 1,72,774 కోట్లు, రెవిన్యూ వ్యయం ఉండగా, అందులో 86,400 కోట్లు కొత్త ఆయుధాలు కొనుగోలుకు, ఆధునీకీకరణకు ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు.

రూ.2.74 లక్షల కోట్లతో వేసిన రక్షణ బడ్జెట్ దేశ జిడిపిలో కేవలం 1.58 శాతం మాత్రమేనని, ఇది 1962లో చైనాతో జరిగిన యుద్ద ఖర్చుకంటే అతి తక్కువేనన్నారు. భద్రతా బలగాలు రక్షణ బడ్జెట్ ను 2శాతం పెంచాలని అనుకొన్నట్టు తెలిపారు. 13వ, రక్షణ ప్రణాళిక ప్రకాంగా భద్రతా దళాలకోసం రూ. 12,88, 654 కోట్ల అంచనా వేయగా, రూ. 13,95, 271 కోట్లు ఖర్చు చేశారు.

ప్రతి ఏటా సాయుధ దళాలను మెరుగుపర్చుకొనేందుకు నిధులను పెంచుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The armed forces have sought an allocation of Rs 26.84 lakh crore ($416 billion) over the next five years to ensure requisite military modernisation and maintenance to take on the collusive threat from Pakistan and China as well as to safeguard India's expanding geostrategic interests.
Please Wait while comments are loading...