వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజిత్ జోగీ ఎస్టీ కాదు... తేల్చిన హైపవర్ కమిటీ .... ఎమ్మెల్యే పదవికి ఎసరు

|
Google Oneindia TeluguNews

18 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఎస్టీనా కాదా అనేది తేలింది. తప్పుడు దృవపత్రాలతో ఎమ్మెల్యేగా గెలుపోందారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వాదనలు ప్రతివాదనలు జరిగి విచారణ చేపట్టారు. ఇందుకోసం సుమారు ఇరవై సంవత్సరాల సమయం పట్టింది. కమిటీల మీద కమీటిలు వేశారు. ఆరాల మీద ఆరాలు తీశారు. చివరకు ఆయన ఎస్టీ కాదని తేల్చారు. అయితే విషయం ఏమిటంటే ఇప్పటికి కూడ సదరు వ్య ఎస్టీ అవుననే అంటున్నాడు. ఇరవై సంవత్సరాలు విచారణ చేపట్టినా తప్పుడు సమాచారమే అంటూ తిరిగి కోర్టుకు వెళతానని చెబుతున్నాడు. ఆయనే ప్రస్తుత ఎమ్మెల్యే చత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి

అజిత్ జోగి ఎస్టీ కాదంటూ తేల్చిన కమిటీ

అజిత్ జోగి ఎస్టీ కాదంటూ తేల్చిన కమిటీ

చత్తీస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తప్పుడు కుల దృవపత్రాలతో ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్రానికే అత్యున్నత పదవి అయిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. దీంతోపాటు తన పదవికాలం కూడ అయిపోయంది. ఆయన చత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన ఎస్టీ కాదంటూ న్యాయం స్థానం నియమించిన హైపవర్ కమిటీ తేల్చి చెప్పింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతుండగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పదవికి కూడ ఎసరు రానుంది.

కేసు పూర్వపరాలు

కేసు పూర్వపరాలు

2001లో బీజేపీ సీనియర్‌ నాయకుడు, జాతీయ ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ నందకుమార్‌ సాయి, మరియు సంత్‌ కుమార్‌ నేతంలు కలిసి అజిత్‌ జోగి ఎస్టీ కాదంటూ రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. కానీ ఒక వ్యక్తి కులాన్ని ధృవీకరించడానికి జాతీయ కమిషన్‌కు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో హైకోర్టు తీర్పును సంత్‌కుమార్‌ సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు, ఒక హైపవర్‌​ కమిటీ వేసి విచారించాలని చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ 2017లో అజిత్‌ జోగి ఎస్టీ కాదంటూ నివేదిక ఇచ్చింది. అయితే అజిత్ జోగీ సభ్యులు తప్పుడు దృవపత్రాలు సమర్పించారని కమిటీ తీర్పును కూడ సవాల్‌ చేస్తూ అజిత్‌జోగి 2018లో హైకోర్టుకు వెళ్లారు.., ఈనేపథ్యంలోనే అజిత్ జోగి వాదనలతో ఏకిభవించిన హై కోర్టు కమిటీ సభ్యులను మార్చింది. అయితే కొత్తగా ఏర్పాటైన కమిటీ కూడా అంతకు ముందు కమిటి ఇచ్చిన నివేదికనే ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా అజిత్‌జోగి ప్రస్తుతం ఎస్టీ రిజర్వుడ్‌ అసెంబ్లీ స్థానం మార్వాహి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

రాజకీయ ఒత్తిడితోనే నివేదిక

రాజకీయ ఒత్తిడితోనే నివేదిక

అయితే రెండు హైపకవర్ కమిటీలు తమ నివేదికలో అజిత్ జోగి ఎస్టీ కాదని చెప్పినా ... ఆయన మాత్రం ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఈ వ్యవహారంపై అజిత్‌ జోగి కుమారుడు అమిత్‌ జోగి స్పందించారు... రాష్ట్రప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఎలాంటి ప్రాథమిక న్యాయ సూత్రాలను పాటించకుండా ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకు ఆయన కోరుకున్న విధంగానే నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. అజిత్ జోగి కలెక్టర్‌గా సెలెక్ట్‌ అయినపుడు రాని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని మండిపడ్డారు. ఈ విషయంపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.

English summary
Former Chhattisgarh chief minister MLA Ajit Jogi is likely to lose his tribal reserved Marwahi seat in the state assembly after a high-powered government committee ruled that he does not qualify as a Scheduled Tribe member and ordered the revocation of his tribal certificates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X