వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న మాజీ సీఎం, తృణమూల్‌ నేత లూయిజిన్హో ఫలేరో.. రీజన్ ఇదే!!

|
Google Oneindia TeluguNews

గోవా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొందరు కీలక నాయకులు టికెట్లు ఇవ్వకుంటే ఇండిపెండెంట్ లుగా బరిలోకి దిగుతున్నారు. మరికొందరు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి తమ పోటీని విరమించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) జాతీయ ఉపాధ్యక్షుడు లూయిజిన్హో ఫలీరో ఫిబ్రవరి 14న జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ లూయిజిన్హో ఫలీరో శుక్రవారం నాడు గోవాలోని ఫటోర్డా నియోజకవర్గం నుండి తృణమూల్ అభ్యర్థిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వైదొలగుతున్నట్లు ప్రకటించారు.

ఫటోర్డా నుండి గోవా టీఎంసీ అభ్యర్థిగా వైదొలిగినట్లు ప్రకటించిన లుయిజిన్హో ఫలీరో

ఫటోర్డా నుండి గోవా టీఎంసీ అభ్యర్థిగా వైదొలిగినట్లు ప్రకటించిన లుయిజిన్హో ఫలీరో

తాను ఫటోర్డా నుండి గోవా టీఎంసీ అభ్యర్థిగా వైదొలిగినట్లు ప్రకటించిన ఆయన ఆ బాధ్యతను ఒక యువ మహిళా న్యాయవాదికి అప్పగిస్తున్నానని వెల్లడించారు. మహిళలకు సాధికారత కల్పించడం టీఎంసీ విధానమని అని లుయిజిన్హో ఫలీరో అన్నారు. ఫటోర్డా నియోజకవర్గానికి తృణమూల్ కొత్త అభ్యర్థి సియోలా అవిలియా వాస్ అని ప్రకటించారు . ఫటోర్డా నుండి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి) చీఫ్ విజయ్ సర్దేశాయ్‌పై సియోలా అవిలియా వాస్ పోటీ చేయనున్నారు.

మమతా బెనర్జీని సంప్రదించిన తర్వాత నిర్ణయం మార్చుకున్న ఫలీరో

మమతా బెనర్జీని సంప్రదించిన తర్వాత నిర్ణయం మార్చుకున్న ఫలీరో

టీఎంసీ గోవా ఇన్‌చార్జి మహువా మొయిత్రా, సియోలా అవిలియా వాస్, లూయిజిన్హో ఫలీరో మరియు బెనౌలిమ్ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావోతో కలిసి, పార్టీ జాతీయ అధ్యక్షురాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సంప్రదించిన తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు లూయిజిన్హో ఫలీరో తెలిపారు. ఆయన టీఎంసీ అభ్యర్థులందరి కోసం గోవాలో ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు.

 ఫటోర్డా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థిగా సియోలా అవిలియా వాస్

ఫటోర్డా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థిగా సియోలా అవిలియా వాస్

ఫలీరో, గతసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఫటోర్డా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయలేకపోయామని తన అనుభవం చెబుతోందని వెల్లడించారు . అది భర్తీ చేయడానికి, మాకు చాలా సమర్థులైన సియోలా అవిలియా వాస్ ఉన్నారు. తను ఫటోర్డా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారని టిఎంసి నాయకుడు, నవేలిమ్ నియోజకవర్గం నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫలీరో తెలిపారు. ఫటోర్డా అభ్యర్థిగా బరిలోకి దిగే ముందు పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు.

టీఎంసీ అభ్యర్థులందరి కోసం ప్రచారం చెయ్యనున్న లుయిజిన్హో ఫలీరో

టీఎంసీ అభ్యర్థులందరి కోసం ప్రచారం చెయ్యనున్న లుయిజిన్హో ఫలీరో

తృణమూల్ జాతీయ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ, "టీఎంసీ అభ్యర్థులందరి కోసం గోవా అంతటా పోరాడాలని మరియు ప్రచారం చేయాలని తాను కోరుకుంటున్నందున మా పార్టీ జాతీయ ఛైర్మన్‌ మమతా బెనర్జీని సంప్రదించిన తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నాను" అని తృణమూల్ జాతీయ ఉపాధ్యక్షుడు చెప్పారు. విలేఖరుల సమావేశంలో మహువా మోయిత్రా మాట్లాడుతూ, తాము బిజెపిపై పోరాడటానికి మరియు ఓడించడానికి ఫటోర్డాలో ఎన్నికల బరిలో ఉన్నామని పేర్కొన్నారు.

Recommended Video

Assembly Elections 2022: Rallies, Road Show లకు EC నో.. | Oneindia Telugu
బీజేపీని వద్దనుకునేవారు టీఎంసీని ఆదరించాలన్న టీఎంసీ నేత మహువా మోయిత్రా

బీజేపీని వద్దనుకునేవారు టీఎంసీని ఆదరించాలన్న టీఎంసీ నేత మహువా మోయిత్రా

తమ ఎంపిక చివరి క్షణంలో చేసింది కాదని, బిజెపిని కోరుకోని ఫటోర్డా ప్రజలకు నిజమైన మరియు నిజాయితీగల ఎంపిక తమ అభ్యర్థి అని పేర్కొన్నారు. తాము ఒక పోరాట యోధురాలు, ఉద్యమకారిణి, అంతేకాదు అత్యంత ముఖ్యమైన రాజకీయ కుటుంబానికి సంబంధం లేని మహిళను ఎంచుకున్నామన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పాలనుకునేవారు ఫటోర్డా నియోజకవర్గంలోనే కాదు యావత్ గోవాలో టీఎంసీని ఆదరించాలని ఆమె కోరారు.

English summary
Former Goa Chief Minister and Trinamool Congress (TMC) national vice-president Luizinho Faleiro formally announced that he would not contest the poll. According to Faleiro, he has taken the decision after 'could not do justice' in the last election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X