కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఇకలేరు

ఢిల్లీ : కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన ఫెర్నాండెజ్ వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో రక్షణ, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారు.
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో 1930, జూన్ 3న జన్మించారు ఫెర్నాండెజ్. కార్మిక సంఘాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన ఫెర్నాండెజ్.. జనతాదళ్ పార్టీలో కీలకపాత్ర పోషించారు. 2010 వరకు రాజకీయాల్లో ఉన్న ఫెర్నాండెజ్.. ఆ తర్వాత దూరమయ్యారు. సుదీర్ఘ పోరాట నాయకునిగా ఫెర్నాండెజ్ రాజకీయ ప్రస్థానం కొనసాగింది.

జనతాదళ్ నేతగా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. వాజ్‌పేయి హయాంలో కీ రోల్ పోషించారు. అనేక పదవులు నిర్వర్తించిన ఫెర్నాండెజ్.. రైల్వే శాఖ, పరిశ్రమలు, కమ్యూనికేషన్స్ లాంటి కీలక శాఖలకు కూడా మంత్రిగా పనిచేశారు. జార్జి ఫెర్నాండెజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు.
George Sahab represented the best of India’s political leadership.
— Narendra Modi (@narendramodi) January 29, 2019
Frank and fearless, forthright and farsighted, he made a valuable contribution to our country. He was among the most effective voices for the rights of the poor and marginalised.
Saddened by his passing away.