నేను అంత త్వరగా చచ్చిపోను గుర్తు పెట్టుకోండి, చెయ్యాల్సింది చాలా ఉంది, మాజీ సీఎం!
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీఎస్ ఈసారి కర్ణాటకలోని హసన్ లోక్‌సభ నియోజకవర్గంను కైవసం చేసుకోవడానికి సిద్దం అవుతోంది. హాసన్ అభ్యర్థిగా మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ మనుమడు, సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది.
మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం ఇప్పటికే హాసన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే హాసన్ జేడీఎస్ నేతలతో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ సమావేశాలు నిర్వహించారు, మాజీ మంత్రి రేవణ్ణ దంపతులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి కూడా హాసన్ జేడీఎస్ నేతలతో సమావేశం అయ్యారు.

హసన్‌లో జరిగిన జేడీఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ ప్రజ్వల్ తన అన్న రేవణ్ణ కొడుకు మాత్రమే కాదని, అతను నా కొడుకు అని, ప్రజ్వల్ లో మార్పు తీసుకువచ్చే బాధ్యత తానే తీసుకుంటానని, ప్రజ్వల్ రేవణ్ణ గెలుపుకు మీరు అందరూ కృషి చేయాలని జేడీఎస్ పార్టీ కార్యకర్తలకు మాజీ సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. తన సోదరుడు రేవణ్ణ హాసన్ జిల్లాలో చేసిన అభివృద్ధి పనుల ముందు తాను చేసింది తక్కువే అని, తన అన్నకొంచెం కోపంగా ఉంటాడు అంతే అని, ఆయన చాలా మంచి వాడు అంటూ మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.
తన సోదరుడు రేవణ్ణ, తన అన్న కొడుకు ప్రజ్వల్ ను మీరు క్షమించాలని, మనస్సులో ఏమీ పెట్టుకోకుండా ప్రజ్వల్ రేవణ్ణ గెలుపుకు అందరూ కలిసి పని చెయ్యాలని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి హాసన్ జిల్లాలోని జేడీఎస్ నాయకులకు మనవి చేశారు. నా దగ్గర టన్నుల కొద్దీ డబ్బు లేదని, నేను డబ్బులు సంపాదించలేదని, మీలాంటి లక్షలాది మంది కార్యకర్తలను తాను సంపాదించానని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి భావోద్వేగానికి గురయ్యారు.

బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి డాక్టర్ మంజునాథ్ పోటీ చేస్తారని కుమారస్వామి తెలిపారు. మీరు ఎన్నికల్లో దేవెగౌడను ఓడించారు. అయినా తన తండ్రి, మేము హాసన్‌ను మరిచిపోలేదని, , జిల్లాలో తాను ఉన్నానని, దేవెగౌడ చేయలేని ఎన్నో పనులు ఇక్కడ ప్రజ్వల్ రేవణ్ణ చేశారని, ఈ ఒక్కసారికి అతన్ని గెలిపించాలని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. రైతులకు, జేడీఎస్ పార్టీకి, కార్యకర్తలకు మంచి చేసి వారికి ఓ దారి చూపించే వరకు తాను చచ్చిపోను అని, తనకు అంత త్వరగా చావురాదని, జేడీఎస్ పార్టీని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న వారిని తాను ఈ మాట చెబుతున్నానని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications