ఆయనతో పెట్టుకున్నారు, సర్వనాశనం అయిపోయారు, ఎంపీ రేణుకాచార్య !

బెంగళూరు/దావణగెరె: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వంటి నేతలను బీజేపీ పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య మండిపడ్డారు. యడియూరప్ప లాంటి వ్యక్తులను పక్కన పెట్టడం వలనే బీజేపీకి శాపంగా మారిందని, చరిష్మా ఉన్నవారిని బీజేపీలోని కొందరు నాయకులు ఎదగనివ్వడం లేదని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రేణుకాచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

యడియూరప్ప కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే బీవై విజయేంద్ర లాంటి వారిని సైడ్ కార్నర్ చేస్తున్నారని రేణుకాచార్య మండిపడ్డారు. ఈ విషయమై రేణుకాచార్య మీడియాతో మాట్లాడుతూ నాకు బీజేపీ నాయకులు నోటీసు ఇచ్చారని, అందుకు బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి నేను హాజరు కాలేదని, అందులో తప్పు ఏముందని కొందరు బీజేపీ నాయకులను ఆయన ప్రశ్నించారు.

 Renukacharya
బ్రహ్మోత్సవాలు, తిరుమలకు బైక్ లో బ్యాన్ చేసిన టీటీడీ, ఘాట్ రోడ్లలో సేఫ్ గా !

నోటీసును ఉపసంహరించుకోవాలని తాను చెప్పానని, అందుకు వారి నుంచి సమాధానం లేదని, అందుకే తాను బీజేపీ నాయకుల సమావేశానికి హాజరు కాలేదని రేణుకాచార్య అన్నారు. నేను చెప్పవలసింది నేను చెప్పాను, వ్యక్తిగతంగా నాకు ఎలాంటి లాభమో, నష్టమో లేదన్నారు. ఇది సామాన్య కార్యకర్తల డిమాండ్ అని, యడియూరప్ప వంటి నేతలను పట్టించుకోలేదని, ఇది బీజేపీకి శాపమని సూటిగా నేను చెప్పాను అని రేణుకాచార్య అన్నారు.

నేను నేరుగా మాట్లాడటం వలనే తన మీద క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. తాను పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని రేణుకాచార్య అన్నారు. నేను మాట్లాడింది కొంతమంది వ్యక్తుల బలహీనతను గుర్తు చేస్తూ సూటిగా ఖండించాను, ప్రజాస్వామ్య వ్యవస్థలో బీజేపీ ఒక రాజకీయ పార్టీ. రాష్ట్ర ప్రజలకు తప్పుడు సందేశం పోయిందని రేణుకాచార్య అన్నారు.

ప్రతిపక్ష నాయకుడి, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడి పదవిని ఇంతవరకు నాయకులను ఎంపిక చేయలేదని, దీనిపై నాలుగు గోడల మధ్య చర్చ జరగాలన్నారు. కొందరైతే క్రూరమైన భ్రమలో ఉన్నారని, దీంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని, ఇదే లోక్‌సభ ఎన్నికల్లో జరగకూడదని తన ఉద్దేశమని రేణుకాచార్య అన్నారు.

 Renukacharya

ప్రపంచంలోనే ఎంతో అభిమానులను సొంతం చేసుకున్న నేతగా పేరొందిన ప్రధాని నరేంద్ర మోదీ మంచి పనులు చేస్తున్నారని, ఆయన మరోసారి ప్రధాని కావాలని మేం కోరుకుంటున్నామని రేణుకాచార్య అన్నారు. నేను బీజేపీని వీడను, ఆ పార్టీలోనే ఉన్నాను. నేనేమీ దాచకుండా బహిరంగంగానే కొందరు బీజేపీ నాయకుల తీరు గురించి చెప్పానని, పార్టీలో సంస్థాగత లోపం ఉందని, దీన్ని చక్కదిద్దాలని రాష్ట్ర బీజేపీపై మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+