Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ కు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్

జమ్ము కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్ - భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు పాకిస్థాన్ పై ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో ఉన్నారు. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారుతోంది.

ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏదైనా దాడికి పాల్పడితే ఆ దేశాన్ని తట్టుకుని.. తిరిగి పోరాడగల శక్తిసామర్థ్యాలు పాకిస్థాన్ కు ఉన్నాయని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి తనను బాగా డిస్టర్బ్ చేసిందన్నారు. ఈ విషాదం జరగకుండా ఉండాల్సింది అని అన్నారు. మృతులకు నివాళులు.. బాధిత కుటుంబాలకు తన సానుభూతి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన అక్కడి ఉన్నతాధికారుల ద్వారా తన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు.

ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం చాలా ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. మొదట శాంతిని తాము కోరుకుంటామని దాన్ని చులకనగా భావించ వద్దని అన్నారు. భారత్ ఏదైనా దాడికి పాల్పడితే తిప్పికొట్టగల శక్తిసామర్థ్యాలు తమకు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Former Pakistani Prime Minister Imran Khan s warning to India

మరోవైపు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రత వైఫల్యంపై దృష్టి సారించింది. జాతీయ భద్రత సలహా మండలిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసింది. జాతీయ భద్రత సలహాదారుగా అజిత్ దోవల్‌ను కొనసాగిస్తూనే పలు మార్పులు చేసింది. జాతీయ భద్రత సలహా మండలి కొత్త ఛైర్మన్‌గా అలోక్ జోషి అపాయింట్ చేసింది. గతంలో ఆయన రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (RAW) చీఫ్‌గా పని చేశారు.

ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయండని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని అన్నారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోనూ ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+