సురేష్ రైనా అరెస్ట్: సింగర్ గురు రంధ్వా కూడా: ముంబైలో అదుపులో తీసుకున్న పోలీసులు
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యారు. ముంబై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సురేష్ రైనాతో పాటు ప్రముఖ గాయకుడు గురు రంధ్వాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గల ముంబై డ్రాగన్‌ఫ్లై క్లబ్‌పై పోలీసులు దాడి చేసిన సందర్భంగా వారు అక్కడే ఉన్నారు. కరోనా వైరస్ నిబంధనలు, ప్రొటోకాల్‌కు విరుద్ధంగా అక్కడ నిర్వహించిన మందుపార్టీలో పాల్గొన్నందుకు వారిని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.













Click it and Unblock the Notifications