వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ మేనకోడలు దీపా చలో ఢిల్లీ: ప్రణబ్, మోడీతో భేటీకి, అందుకే !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ జరిపించాలని కోరుతూ ఆమె మేనకోడలు దీపా జయకుమార్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలను కలిసేందుకు సన్నాహాలు సాగిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

న్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ జరిపించాలని కోరుతూ ఆమె మేనకోడలు దీపా జయకుమార్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలను కలిసేందుకు సన్నాహాలు సాగిస్తున్నారు.

జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. జయలలిత మేనకోడలు దీపా రాజకీయ అరగేట్రంతో ఆ చీలిక మూడుగా మారిపోయింది. అన్నాడీఎంకే కార్యకర్తలను పన్నీర్ సెల్వం, శశికళ, దీపా తలా కొంత పంచుకున్నారు.

పన్నీర్ సెల్వం, శశికళ, దీపా జయకుమార్ రాజకీయ జీవితాలకు ప్రధాన కారకురాలైన జయలలిత అనుమానాస్పదస్థితిలో మరణించారనే వివాదం నెలకొని ఉంది. జయలలిత మరణం వెనుకు శశికళ కుట్ర దాగి ఉందని కొందరు ఆరోపిస్తున్నారు.

ఐ ఫోన్ లాంటి అమ్మకు ఓటు వేస్తే డబ్బా ఫోన్ లాంటి చిన్నమ్మనా: సెగ !ఐ ఫోన్ లాంటి అమ్మకు ఓటు వేస్తే డబ్బా ఫోన్ లాంటి చిన్నమ్మనా: సెగ !

Former TN CM Jayalalithaa's niece Deepa is planning to meet PM Modi and president Pranab Mukherjee in Delhi.

జయలలిత మరణం వెనుక ఉన్న మర్మాన్ని బైటపెట్టాలని, సీబీఐ విచారణ చెయ్యాలని తమిళనాడులో పెద్ద ఎత్తున డిమాండ్లు లేచాయి. ఇందులో భాగంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన 12 మంది ఎంపీలు ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి జయలలిత మరణంపై సీబీఐ విచారణ చేయించాలని మనవి చేశారు.

తమను చుట్టుకున్న అపవాదు నుంచి బయటపడటానికి శశికళ వర్గం సైతం ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఇప్పుడు మూడో వర్గం దీపా సైతం ఢిల్లీ పర్యటనకు సిద్దం అయ్యారు. గత సెప్టెంబర్ 22వ తేదిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో జయలలిత స్పృహతప్పిపోయిన స్థితిలో ఆసుపత్రిలో చేరారని ప్రచారం జరుగుతోంది.

<strong>తమిళనాడులో మరో ఉద్యమం: ఉద్రిక్త పరిస్థితి, పళనిసామికి అగ్నిపరిక్ష!</strong>తమిళనాడులో మరో ఉద్యమం: ఉద్రిక్త పరిస్థితి, పళనిసామికి అగ్నిపరిక్ష!

అయితే జయలలిత స్పృహతప్పడానికి దారితీసిన కారణాలు ఏమిటనే ప్రశ్న తలెత్తింది. ఈ అనుమానాలు నివృతి కోసమే సీబీఐ దర్యాప్తు చేయించాలని పలువురు డిమాండ్లు చేస్తున్నారు. ఇదే అంశంపై దీపా ఢిల్లీ పర్యనటకు సిద్దం అయ్యారు.

ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని కలిసేందుకు అవకాశం దొరికిన పక్షంలో జయలలిత మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించాలని దీపా, ఆమె వర్గీయులు భావిస్తున్నారు.

English summary
Former CM Jayalalithaa's niece Deepa is planning to meet PM Modi and president Pranab Mukherjee in Delhi. She is planning to request them to order an inquiry about the suspicious death of her aunt Jaya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X