మర్యాదగా ఖాళీ చేయండి: మాజీ మంత్రులకు నోటీసులు జారీ
న్యూఢిల్లీ: బంగ్లాలు ఖాళీ చెయ్యకుండా తిష్ట వేసిన కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలకు కేంద్ర పట్టణాభి వృద్ది శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. మర్యాదగా మీరు బంగ్లాలు ఖాళీ చేసి మాకు తాళాలు అప్పగించాలని సూచించారు.
మీరు మాజీ మంత్రులు, ప్రస్తుతం రాజ్యసభ, పార్లమెంట్ లో సభ్యులు కాదు, మీకు ఎందుకు ప్రభుత్వానికి చెందిన బంగ్లాలు ఇవ్వాలని సూటిగా ప్రశ్నిస్తూ నోటీసులు ఇచ్చారు. వెంటనే బంగ్లాలు ఖాళీ చెయ్యాలని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రులు నోటీసులు తీసుకుని వారి దుకాణం బంద్ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.
కేంద్ర మాజీ మంత్రులు అంబికా సోని, వయలార్ రవి, రాజీవ్ శుక్లాతో పాటు మరొకరికి నోటీసులు జారి అయ్యాయి. అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటకలోని కోలారు ఎంపీ కే.హెచ్. మునియప్ప, ఎంపీలు అధీర్ రంజన్ చౌదరి, టీఎంసీ పార్టీకి చెందిన సుదీప్ బండోపాధ్యాయకు నోటీసులు ఇచ్చారు.

ఢిల్లీలోని లూటియానా ప్రాంతంలో వీరు బంగ్లాలు తీసుకున్నారు. ప్రభుత్వ నియమాల ప్రకారం ఈ బంగ్లాలో కేంద్ర మంత్రులు ఉండాలి. బంగ్లాలు ఖాళీ చెయ్యాలని ఎన్నిసార్లు మనవి చేసినా వీరు పట్టించుకోలేదని సమాచారం.
ఢిల్లీలోని అక్బర్ రోడ్డు, లూటియానా ప్రాంతాలలోని ప్రభుత్వ బంగ్లాలలో అధికారంలో లేని రాజకీయ నాయకులు కొన్ని సంవత్సరాల నుండి మకాం వేశారని పట్టణాభి వృద్ది శాఖ అధికారులు అంటున్నారు. కేంద్ర మంత్రులుకు బంగ్లాలు కేటాయించిన తరువాత మిగిలితే ఎవరికైన కేటాయించవచ్చని అధికారులు అన్నారు.
ప్రభుత్వ బంగ్లాలు కావాలంటే ముందుగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ అధికారులకు అర్జీలు సమర్పించుకోవాలి. అది ముందుగా ఎవరు అర్జీలు సమర్పించారో వారి వారి అర్హతను బట్టి బంగ్లాలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications