60 ఏళ్ల వయస్సులో పెళ్లిచేసుకుంటున్న బీజేపీ దిగ్గజ నేత.. పెళ్లికూతురు ఎవరో తెలుసా
పశ్చిమ బెంగాల్ బీజేపీ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పెళ్లి చేసుకోబోతున్నారు. 60 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోబోతున్నారు. ఏప్రిల్ 18, శుక్రవారం ఆయన వివాహం జరగనుంది. ఆ పార్టీకే చెందిన రింకూ మజుందార్ అనే నాయకురాలిని ఆయన వివాహం చేసుకోనున్నారు. అతికొద్ది మంది సమక్షంలో ఆయన వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.
బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. 60 ఏళ్ల వయసులో ఆయన వివాహం చేసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం సంప్రదాయ పద్దతిలో ఆయన వివాహం అతికొద్ది మంది సన్నిహితులు, కార్యకర్తలు, స్నేహితుల మధ్య జరగనుంది.రింకూ మజుందార్ అనే బీజేపీ కార్యకర్తను ఆయన వివాహం చేసుకుంటున్నారు.
వీరిద్దరికీ గత కొన్నేళ్లుగా పరిచయం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్నింగ్ వాక్ లో ఇద్దరూ పరిచయం అయ్యారని.. అలా ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చి ఇష్టపూరితంగా వివాహం చేసుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు. అయితే ఘోష్ బ్రహ్మచారి కాగా.. మజుందార్ కు ఇది రెండో వివాహం. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.
అందుకే పెళ్లి..
తన తల్లి కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు దిలీప్ ఘోష్ ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. పెళ్లి తర్వాత కూడా క్రీయాశీల రాజకీయాల్లో పాల్గొంటానని క్యాడర్ కు హామీ ఇచ్చారు. పెళ్లి తన రాజకీయ, వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ఇక ఆయన వివాహ విషయం తెలిసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు దిలీప్ ఘోష్ ఇంటికి వెళ్లి కంగ్రాస్ చెబుతున్నారు.

ఇక దిలీప్ ఘోష్ చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడిగా ఉన్నారు. 2015 నుంచి బీజేపీలో క్రియాశీలకంగా మారారు. అంతకుముందు, RSS లో దేశవ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేశారు. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications