40 పడవలు: బంగాళాఖాతంలో 640 జాలర్ల గల్లంతు

గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు జరుపుతున్నాయి. అయితే, తుఫాను కారణంగా తమ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదని అధికారులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.
ఒక్కో పడవలో 16 మంది జాలర్లు ఉన్నట్లు సమాచారం. కాక్‌ద్వీప్‌లోని సంఘం లాయిజన్ యూనిట్‌తో వారికి సంబంధాలు తెగిపోయాయి. గత రాత్రి తుఫాను సందర్భంగా సూర్యనారాయణ్, మహారుద్ర అనే పడవలు సముద్రంలో చిక్కుకున్నాయి.
ఇదిలావుంటే, రాయిదిఘి నుంచి బయలుదేరిన మరో ఐదు పడవలు ఒడిషాలోని ధామ్రా ఓడరేవుకు చేరుకోగలిగాయి. వీటిలో జాలర్లంతా సురక్షితంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications