4రోజుల తర్వాత సమాధిలోంచి బయటకొచ్చాడు!
రాయ్‌పూర్: చనిపోయిన వ్యక్తి తిరిగి బతకడం అనేది అసాధ్యం. కానీ, ఓ సాధువు నాలుగు రోజుల తర్వాత సమాధి నుంచి బతికి బయటకు వచ్చిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. పచేరీ గ్రామానికి చెందిన బాబా చమ్మన్ జోషి అనే ఓ సాధువు నాలుగు రోజుల క్రితం(డిసెంబర్ 18న) తనని తాను సమాధి చేసుకున్నాడు.
పూర్తిగా మట్టితో కప్పివేసిన బంకర్ లాంటి సమాధినుంచి నాలుగు రోజుల తర్వాత లేచి బయటకు వచ్చాడు. దీంతో గ్రామస్థులు నిర్ఘాంతపోయారు. ఇలా జరగడం ఇది రెండోసారని ఇంతకుముందు కూడా ఈ సాధువు ఇలాగే సమాధిలో ఉండి 18 గంటల తర్వాత లేచివచ్చాడని స్థానికులు చెబుతున్నారు.

కాగా, ఇప్పుడు వారంతా ఆ సాధువును దేవదూతగా భావిస్తూ పూజలు చేస్తున్నారు. అయితే సాధువు 80 గంటల వరకు సమాధిలో ఉండడం పెద్ద విషయమేమీ కాదని అతను సమాధి అయిన స్థలంలో దాదాపు 1000 క్యూబిక్ మీటర్ల వరకు ఆక్సిజన్ అందుతుందని అంధశరద్ధా అన్ములన్ సమితి కార్యకర్త దినేష్ మిశ్రా తెలిపారు.
అంతేగాక, సాధువు ఉన్న సమాధిని పూర్తిగా పూడ్చేయలేదని, అలాంటి చోట 5 రోజుల వరకూ బాగానే ఉండవచ్చని అక్కడి సామాజిక కార్యకర్తలు చెప్పారు. ఇలాంటి జిమ్మిక్కులను నమ్మిమోసపోవద్దని వారు గ్రామస్థులకు సూచించారు. ఇది ఇలా ఉండగా, పోలీసులు సైతం సజీవసమాధి ప్రయత్నాలకు అనుమతిచ్చేది లేదని గ్రామస్థులను తీవ్రంగా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications