అమరనాథ యాత్రలో నలుగురు మృతి
శ్రీనగర్: అమరానాథ యాత్రకు వెళుతున్న నలుగురు భక్తులు ఆనారోగ్యంతో మరణించారని అధికారులు వెల్లడించారు. నలుగురు భక్తులు గుండె పోటుతో మరణించారని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు.
ఢిల్లీకి చెందిన సత్వల్ సింగ్ (47), పంజాబ్ కు చెందిన అమన్ దీప్ (27), మణిపురకు చెందిన రామ్ అవతార్ (60), మహారాష్ట్రకు చెందిన భామదాస్ (50) అనే నలుగురు భక్తులు గుండె పోటుతో మరణించారని అధికారికంగా వెల్లడించారు.

జులై 2వ తేదిన జమ్మూ కాశ్మీర్ లో అమరనాథ యాత్ర ప్రారంభం అయ్యింది. గత 15 రోజుల నుండి 2.40 లక్షల మంది భక్తులు అమరనాథ యాత్రలో పాల్గోని పవిత్రమైన మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండ జాగ్రతలు తీసుకున్నారు.
వాతవరణంలో మార్పులు రావడంతో అమరనాథ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. టెంట్ లు వేసి భక్తులు బస చెయ్యడానికి ఏర్పాట్లు చేశారు. భక్తులు ఉంటున్న ప్రాంతంలో సైన్యం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. వాతరణం అనుకూలించిన తరువాత అమరనాథ యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications