వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఫ్రీచార్జ్ సిఈఓ గోవింద్ రాజన్ రాజీనామా, కొత్త సిఈఓ జాసన్ కొఠారి

ఫ్రీచార్జి సిఈఓ గోవింద్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. 2015 లో ఆయన ప్రీ చార్జ్ సంస్థ సిఈఓగా బాద్యతలను స్వీకరించారు. సంస్థ ఎదుగుదలకుఆయన విశేష కృషి చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం స్నాప్ డీల్ అనుబంధ సంస్థ ప్రీచార్జ్ సీఈఓ గోవింద్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. 2015 లో గోవింద్ రాజన్ ప్రీ చార్జ్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించారు.

గోవింద్ రాజన్ గతంలో భారతీ ఎయిర్ టెల్ కు సిఈఓ గా పనిచేశారు. ప్రీచార్జ్ ఎదుగుదలకు విశేష కృషి చేశారు గోవిందరాజన్. ఈ మేరకు గోవింద రాజన్ చేసిన సేవలను స్నాప్ డీల్ సహ వ్యవస్థాపకులు కునాల్ బాల్ కొనియాడారు.

free charge ceo govind rajan resigns

ఎయిర్ టెల్ నుండి బయటకు వచ్చాక 2015 ఆగష్టులో ప్రీ చార్జ్ సిఈఓగా గోవిందరాజన్ బాద్యతలను స్వీకరించారు. దాదాపుగా ఏడాదిన్నర పాటు ఆయన విశేష సేవలను అందించారు.

గోవింద రాజన్ వైదొలగడంతో ఆయన స్థానంలో నూతన సిఈఓగా జాసన్ కొఠారి బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రీ చార్జ్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్టుగా రాజన్ తెలిపారు.

గత ఏడాది మే నెలలో ఆనంద్ చంద్రశేఖరన్ ప్రీచార్జ్ నుండి బయటకు వచ్చి ఫేస్ బుక్ సంస్థలో జాయిన్ అయ్యారు.రాజన్ అనంతరం సిఈఓ గా రానున్న జాసన్ కొఠారి ఎప్పడు బాద్యతలను స్వీకరిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు.

English summary
govind rajan, the ceo of jasper infotech owned digital payment platform freecharge has resigned from company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X