రండి.. ఓటు వేయండి.. భయం నుంచి దేశాన్ని విముక్తి చేయండి: రాహుల్ గాంధీ పిలుపు

యూపీ ఫస్ట్ ఫేజ్ ఎన్నిక కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రండి.. బయటకు రండి.. ఓటు వేసి.. దేశాన్ని భయాల నుంచి విముక్తి చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి మోడీ లక్ష్యంగా పరోక్షంగా విమర్శలు చేశారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ భుజాలపై నెట్టింది. దీంతో రాహుల్ గాంధీ అంటిముట్టనట్టుగానే ప్రచారం చేశారు. కానీ ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఇటు యూపీలో 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 15 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇవాళ 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 73 మంది మహిళలు ఉన్నారు.

Free India from fear: Rahul Gandhi appeals people to vote in UP polls

తొలివిడతలో మొత్తం 11 జిల్లాల్లో గల 58 నియోజకవర్గాల ఓటింగ్ జరగనుంది. షామ్లీ, ముజప్ఫర్ నగర్, మీరఠ్, బాగ్‌పట్, ఘజియాబాద్, హాపుర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంది. యూపీలో మొత్తం 7 విడతలో పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఆ రోజు ఎవరూ రాజు తెలియనుంది. యూపీలో విజయం సాధిస్తే.. దేశంలో అధికారం చేపట్టడం ఖాయం అని బలంగా నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+