Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉచిత బస్సే జిందా తిలిస్మాత్

కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రతిపక్ష నేత వీడీ సతీషన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం కొచ్చిలో దీన్ని ఆవిష్కరించారు. సంక్షేమ పెన్షన్లను రూ. 3,000కు పెంచడం, ధాన్యానికి కిలో రూ. 35 మద్దతు ధర, ఆశా వర్కర్ల దినసరి వేతనం రూ.700కి పెంచడం వంటి కీలక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయిదు ప్రధాన హామీలు..

తిరువనంతపురంలో రాహుల్ గాంధీ పుతు యుగ యాత్ర ముగింపులో ప్రకటించిన అయిదు ప్రధాన హామీల ఆధారంగా ఈ మేనిఫెస్టో రూపొందింది. రేవంత్ రెడ్డి తెలంగాణలో 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లుగానే, యూడీఎఫ్ కూడా జాప్యం లేకుండా తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటుందని సతీషన్ ధీమా వ్యక్తం చేశారు.

Free KSRTC Travel for Women Indira Canteen Expansion and Free Ration Support UDF Promises

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

ఈ అయిదు హామీలలో మహిళలకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) బస్‌లలో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థినులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం అందించడం, దివంగత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పేరుతో రూ. 25 లక్షల ఆరోగ్య బీమా, సంక్షేమ పెన్షన్లు రూ. 3,000కు పెంపు, యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ప్రభుత్వ విభాగం ఏర్పాటు వంటివి ప్రధానమైనవి.

ఇందిరా క్యాంటీన్లు..

మేనిఫెస్టో సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, వ్యవసాయ సంస్కరణలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. అర్హులైన లబ్ధిదారులందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా చట్టాన్ని తీసుకువస్తామని, ఆకలి రహిత కేరళగా రాష్ట్రాన్ని దీర్చిదిద్దే క్రమంలో ఇందిరా క్యాంటీన్లను విస్తరిస్తామని కూడా యూడీఎఫ్ ప్రకటించింది. ప్రత్యేక పరిస్థితులు, ప్రాంతాలలో అర్హులైన వర్గాలకు ఉచిత రేషన్ మద్దతు అందిస్తారు. పేదరిక నిర్మూలనకు ఆశ్రయ పథకం రెండవ దశలో నవ ఆశ్రయను అమలు చేస్తామని యూడీఎఫ్ తెలిపింది.

సిద్ధార్థన్ పేరు మీద..

ఇది సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను గుర్తించి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. క్యాంపస్ సమస్యల పరిష్కారంపైనా మేనిఫెస్టో దృష్టి సారించింది. సిద్ధార్థన్- స్టూడెంట్ డిస్ట్రెస్ యాప్, విద్యా సంస్థలలో రక్షణను బలోపేతం చేయడానికి యాంటీ ర్యాగింగ్ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ చట్టాన్ని యూడీఎఫ్ ప్రతిపాదించింది. వాయనాడ్‌లోని ఓ వెటర్నరీ కళాశాల విద్యార్థి సిద్ధార్థన్ ర్యాగింగ్ ఆరోపణల తర్వాత మరణించినందున వీటికి ఈ పేరు పెట్టింది.

ఆశా వర్కర్ల దినసరి వేతనం..

యువత సాధికారతకు యువశక్తి నాడిన సంపత్ కింద ప్రణాళికా వ్యయంలో అయిదు శాతం కేటాయింపు, కుటుంబశ్రీ తరహాలో యువశ్రీ కలెక్టివ్‌లను ప్రవేశపెడతామని యూడీఎఫ్ హామీ ఇచ్చింది. ఆశా వర్కర్ల దినసరి వేతనం రూ. 700కి పెంపు, అంగన్‌వాడీ, పాఠశాల వంటవాళ్ళతో సహా ఇతర పథకాల కార్మికుల వేతనాలను సవరించి మెరుగైన ప్రయోజనాలు అందిస్తామని యూడీఎఫ్ ప్రతిపాదించింది. వ్యవసాయ సంస్కరణలలో భాగంగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ కనీస మద్దతు ధరల సిఫార్సుల అమలుకు యూడీఎఫ్ హామీ ఇచ్చింది.

రబ్బర్‌కు రూ. 300 మద్దతు ధర..

రబ్బర్‌కు రూ. 300 మద్దతు ధరతో పాటు సీఐఏఎల్ నమూనాలో రబ్బర్ కంపెనీ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. కొబ్బరికి మద్దతు ధరల పెంపు, కొనుగోలు కేంద్రాల విస్తరణ వంటివి కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. మానవ-వన్యప్రాణి సంఘర్షణల నియంత్రణకు డ్రోన్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ ఆధారిత నిఘా వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తారు. వన్యప్రాణుల దాడులలో మరణించిన వారికి ఇచ్చే పరిహారాన్ని 50 శాతం పెంచుతామని కూడా మేనిఫెస్టోలో స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+