దారుణం: పెళ్లికి నిరాకరించిందని ప్రేయసి గొంతుకోశాడు

పోలీసుల కథనం ప్రకారం.. ట్యుటికొరిన్‌కు చెందిన బాధితురాలు అనుభారతి(17) చెన్నై నగరంలోని తన బంధువుల నివాసంలో ఉండి ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసించింది. కాగా దూరపు బంధువైన నిందిత యువకుడు జయరమణ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్న జయరమణ, వివాహ విషయమై ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాడు. వారు అంగీకరించకపోవడంతో వాగ్వాదానికి దిగాడు.
దీంతో జయరమణకు చదువులేదని, ఏ ఉద్యోగం కూడా చేయడం లేదని అతన్ని మర్చిపోవాలని అనుభారతికి ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అయినా జయరమణ, అనుభారతిలు తరచూ కలుసుకుంటూ ఉండేవారు. దీంతో అనుభారతిని అతనికి దూరంగా ఉంచాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించి అనుభారతిని తిరిగి చెన్నై నగరానికి పంపించారు. అయినప్పటికీ వారిద్దరూ అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉండేవారు. తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు.
కాగా నగరానికి వచ్చినప్పుడు జయరమణ అతని బంధువుల ఇంట్లో ఉండి బయట ఆమెను కలుసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత మరోసారి ఆమె తల్లిదండ్రుల వద్దకు అనుభారతితో తన వివాహం చేయాలని కోరాడు. వారు నిరాకరించడంతో నగరానికి వచ్చిన జయరమణ, అనుభారతిని కలిసి తనను వివాహం చేసుకోవాలని కోరాడు. అయితే ఆమె అందుకు నిరాకరించి, మొదట తన చదువును పూర్తి చేయాలని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన జయరమణ తనతోపాటు తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి హత్య చేశాడు.












Click it and Unblock the Notifications