Friends: యువకుడిని నడిరోడ్డు నరికి చంపేసిన ఫ్రెండ్స్, చంపేసి పోలీస్ స్టేషన్ లో స్టోరీ చెప్పారు !

చెన్నై/ కోయంబత్తూరు: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకులు ఒకే పార్టీలో చురుకుగా పని చేశారు. యువకుల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. రానురాను యువకుల మధ్య ఆదిపత్య పోరు మొదలైయ్యింది. ఇదే సమయంలో డబ్బుల విషయంలో స్నేహితుల మద్య గొడవలు జరిగాయి. కొంతకాలం తరువాత ఓ యువకుడు అతనికి క్లోజ్ గా ఉంటున్న కొందరు యువకులతో కలిసి ఆ పార్టీని వదిలేసి అధికార పార్టీ నాయకుడి దగ్గరకు వెళ్లి ఆ పార్టీలో చేరిపోయారు. మాతో కలిసి ఇంతకాలం తిరిగాడని, ఇప్పుడు అధికార పార్టీలో చేరిపోయి రెచ్చిపోతున్నాడని సాటి స్నేహితులు ఆ యువకుడి మీద కక్ష పెంచుకున్నారు. అంతే నడిరోడ్డులో పార్టీ మారిన యువకుడిని వెంటాడి వెంటాడి దారుణంగా నరికి చంపేశారు. మాజీ స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఇద్దరు యువకులు వాడిని మేమే చంపేశామని పోలీసుల ముందు లొంగిపోవడం కలకలం రేపింది.

 ఒకే ఏరియాలో స్నేహితులు

ఒకే ఏరియాలో స్నేహితులు

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని అనురాధపురం సమీపంలోని నాగమ్మపుత్తూరులో సుందరం అనే ఆయన నివాసం ఉంటున్నాడు. సుందరం కుమారుడు శరవణ సుందరం అలియాస్ సుందరం (19) అనే యువకుడు హిందూ ఫ్రంట్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడు. శరవణకు తమిళ సెల్వన్ (26), రాజరాజన్ అనే స్నేహితులు ఉన్నారు.

 ఒకే పార్టీలో పని చేశారు

ఒకే పార్టీలో పని చేశారు

శరవణ ఒత్తిడి చెయ్యడంతో అతని స్నేహితులు తమిళ సెల్వన్, రాజరాజన్ కూడా హిందూ ఫ్రంట్ పార్టీలో చేశారు. శరవణ అతని స్నేహితులు తమిళ సెల్వన్, రాజరాజన్ హిందూ ఫ్రంట్ పార్టీ చురుకుగా పని చేశారు. బయట ఊర్లకు, పార్టీలకు, పార్టీలకు ఇలా ఎక్కడికి వెళ్లినా ముగ్గురు కలిసి వెళ్లి ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నారు.

 పార్టీ మారిపోయిన శరవణ

పార్టీ మారిపోయిన శరవణ


శరవణ, తమిళ సెల్వన్ ల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. రానురాను వీరి ఆదిపత్య పోరు మొదలైయ్యింది. ఇదే సమయంలో డబ్బుల విషయంలో శరవణ, తమిళ సెల్వన్ ల మద్య గొడవలు జరిగాయి. కొంతకాలం క్రితం శరవణ అతనికి క్లోజ్ గా ఉంటున్న కొందరు యువకులతో కలిసి హిందూ ఫ్రంట్ పార్టీని వదిలేసి తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నాయకుడి దగ్గరకు వెళ్లి డీఎంకే పార్టీలో చేరిపోయాడు.

 నడిరోడ్డులో కొడవలితో దాడి

నడిరోడ్డులో కొడవలితో దాడి


మాతో కలిసి ఇంతకాలం తిరిగిన శరవణ ఇప్పుడు మమ్మల్ని కాదని అధికార పార్టీ డీఎంకేలో చేరిపోయి రెచ్చిపోతున్నాడని సాటి స్నేహితులు తమిళ సెల్వన్, రాజరాజన్ అతని మీద కక్ష పెంచుకున్నారు. అంతే అన్నూరు సమీపంలోని మైలురాయి బస్ స్టాండ్ సమీపంలో నడిరోడ్డులో నిలబడిన ఉన్న శరవణను మీద కొడవలితో దాడి చేశారు.

నరికి చంపేసి లొంగిపోయిన మాజీ ఫ్రెండ్స్

నరికి చంపేసి లొంగిపోయిన మాజీ ఫ్రెండ్స్


తప్పించుకోవడానికి ప్రయత్నించిన శరవణను వెంటాడి వెంటాడి దారుణంగా నరికి చంపేశారు. మాజీ స్నేహితుడు శరవణను దారుణంగా హత్య చేసిన ఇద్దరు యువకులు తమిళ సెల్వన్, రాజరాజన్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాడిని మేమే చంపేశామని పోలీసుల ముందు లొంగిపోవడం కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీలు, పాతకక్షల కారణంగా శరవణ హత్యకు గురైనాడని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+