• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Friends: రేయ్, నేను మీ మమ్మి రాత్రి.... పచ్చి బూతులు, కోడి కోసినట్లు కోసేశాడు, లిక్కర్ ఎఫెక్ట్ !

|

బెంగళూరు: కలసిమెలసి తిరుగుతున్న బాల్య స్నేహితులు ఒకే చోట పని చేస్తున్నారు. సినిమాలు, షికార్లకు వెళ్లినా, మందు పార్టీలకు, డాబాలకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెలుతుంటారు. ప్రతిరోజు ఇద్దరు కలిసి కొన్ని గంటల పాటు గడుపుతుంటారు. రేయ్... నేను, మీ మమ్మి క్లోజ్ ఫ్రెండ్స్, ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్, నీకు ఎలాంటి కష్టం రానివ్వను అని ఓ రకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. రానురాను మీ అమ్మా నేను....... అంటూ బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు. బాల్యస్నేహితుడి మాట తీరు హద్దులు దాటడం, తన తల్లి గురించి అసభ్యంగా మాట్లాడటంతో రగిలిపోయిన యువకుడు అతని ప్రాణ స్నేహితుడిని కోడిని కోసినట్లు కేసి చంపేశాడు. లిక్కర్ దెబ్బతో స్నేహితుడి చేతిలో అతని ఫ్రెండ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Illegal affair: రాత్రి పంప్ సెట్ రూమ్ లో ఎంజాయ్, షాకింగ్ నిర్ణయం, అంకుల్ తో?Illegal affair: రాత్రి పంప్ సెట్ రూమ్ లో ఎంజాయ్, షాకింగ్ నిర్ణయం, అంకుల్ తో?

 బాల్యస్నేహితులు

బాల్యస్నేహితులు

ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని కేజీ హళ్ళి (కాడుగోండనహళ్ళి)లో ఫరాన్ (26), యూసఫ్ (28) అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. ఒకే ప్రాంతంలో పుట్టిపెరిగిన ఫరాన్, యూసఫ్ వయసులో రెండు సంవత్సరాలు తేడా ఉన్నా ఇద్దరు బాల్య స్నేహితులుగా, ఒరేయ్ ఒరేయ్ అంటూ పిలుచుకుంటూ కలిసిమెలసి తిరుగుతున్నారు.

 చికెన్ సెంటర్ లో పని

చికెన్ సెంటర్ లో పని

యూసఫ్, ఫరాన్ ఇద్దరూ కేజీ హళ్ళిలోని ఓ ఫేమస్ చికెన్ సెంటర్ లో పని చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే చికెన్ సెంటర్ కు వెళ్లి రాత్రి 8 గంటల వరకు ఇద్దరు అక్కడే పని చేస్తుంటారు. సినిమాలు, షికార్లకు వెళ్లినా, మందు పార్టీలు చేసుకున్నా యూసఫ్, ఫరాన్ కలిసే ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

 రేయ్.... నేను మీ మమ్మి క్లోజ్ ఫ్రెండ్స్

రేయ్.... నేను మీ మమ్మి క్లోజ్ ఫ్రెండ్స్

ఫరాన్ రోజురోజుకు అతిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. రేయ్, నేను మీ అమ్మ క్లోజ్ ఫ్రెండ్స్ రా, మీ అమ్మా నాకు అన్ని విషయాలు చెబుతోంది, నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉన్నాని మరిచిపోవద్దు అంటూ ఫరాన్ అతని స్నేహితుడు యూసఫ్ తల్లి గురించి అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

 మీ అమ్మ కత్తిలా ఉంటుందిరా

మీ అమ్మ కత్తిలా ఉంటుందిరా

ఫ్రెండ్ ఫరాన్ ఏదో తాగి వాగుతున్నాడు అంటూ యూసఫ్ ఇంతకాలం పెద్దగా పట్టించుకోలేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో రేయ్, వారం ముందు నువ్వు, మీ నాన్న ఊరికి వెళ్లిన సమయంలో రాత్రి మొత్తం నేను మీ ఇంట్లోనే ఉన్నానని, మీ అమ్మ కత్తిలా ఉంటుందని, నేను ఆంటీతో....... అంటూ ఫరాన్ పచ్చి బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు.

 కోడి కోసినట్లు కోసేశాడు

కోడి కోసినట్లు కోసేశాడు

మా అమ్మను ఏమైనా అంటే నేను సహించను, నిన్ను చంపేస్తాను అంటూ యూసఫ్ అతని ఫ్రెండ్ ఫరాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఫరాన్ మాత్రం ఫ్రెండ్ తల్లిని అసభ్యంగా మాట్లాడుతూ ఆమె క్యారెక్టర్ గురించి చీఫ్ గా మాట్లాడాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన యూసఫ్ చికెన్ సెంటర్ లో కోళ్లు కత్తిరించే పదునైన కత్తి తీసుకుని ఫరాన్ చెవి వెనుక వైప్ కోడిని కోసినట్లు కోసేశాడు.

 చావురా నా కొడకా

చావురా నా కొడకా

చెవి పూర్తిగా తెగిపోవడం, తలలోకి కత్తి దూసుకోవడంతో ఫరాన్ కుప్పకూలిపోయాడు. రేయ్ మా అమ్మ గురించి నువ్వు చెడుగా మాట్లాడుతావా, మా ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడుతావా, చావురా నా కొడకా అంటూ యూసఫ్ అక్కడి నుంచి పరారైనాడు. తీవ్రస్థాయిలో రక్తం పోవడంతో ఫరాన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 నోటి దూలతో ఫ్రెండ్ కోపానికి బలి

నోటి దూలతో ఫ్రెండ్ కోపానికి బలి

ఫరాన్ హత్య విషయం తెలుసుకున్న కేజీ హళ్ళి పోలీసులు ఫ్రెండ్ ను హత్య చేసిన యూసఫ్ కోసం గాలిస్తున్నారు. యూసఫ్ ఆచూకి చిక్కిందని, అతన్ని త్వరలో పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. ఫ్రెండ్ తల్లిని అసభ్యంగా మాట్లాడి స్నేహితుడి చేతిలో ఫరాన్ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

  Hero Ajith Cycling In Hyderabad హైదరాబాద్ రోడ్డుపై చాయ్ తాగుతూ కనిపించిన స్టార్ హీరో..!!

  English summary
  Friends: Youth killed his close friend near KG Halli in Bengaluru in Karnataka.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X