శశికళ కోసం పార్టీ రాజ్యాంగంలో కీలక మార్పులు, జయలలితకూ పదవి!
శశికళకు అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆమెను పార్టీ చీఫ్‌గా చేసేందుకు పార్టీ రాజ్యాంగం మార్చనున్నారు.
చెన్నై: శశికళకు అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆమెను పార్టీ చీఫ్‌గా చేసేందుకు పార్టీ రాజ్యాంగం మార్చనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే దివంగత జయలలికు కూడా పదవి ఉండనుంది. అదే సమయంలో పార్టీని శశికళ చేతుల్లో పెట్టనున్నారు.
ఇందుకోసం పార్టీ రాజ్యాంగం మార్చనున్నారు. దివంగత జయలలితను పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ప్రకటించనున్నారు. ఇక, శశికళ కోసం పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తూ ఆమెకు సంయుక్త కార్యదర్శి పదవిని అప్పగించనున్నారు.

ఇప్పటి వరకు పార్టీ పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఉంది. ఆ పదవిలో ఇన్నేళ్లుగా జయలలిత ఉన్నారు. ఇప్పుడు ఆ పదవిని శశికళకు కట్టబెట్టడంపై తర్జనభర్జన జరుగుతోంది. పలువురు ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా పార్టీ రాజ్యాంగాన్ని మార్చి జయలలితను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఉంచి, శశికళను సంయుక్త కార్యదర్శిగా నియమించనున్నారు. దీని కోసం పార్టీ నాయకులు, సీనియర్లు కూడా అంగీకరించారు.












Click it and Unblock the Notifications