బంగ్లాపై భారత్ విజయం: ట్విట్టర్‌లో ఎవరేమన్నారు...? (ట్వీట్స్)

మెల్‌బోర్న్: వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీస్‌కు చేరుకుంది. బంగ్లాదేశ్‌పై మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో 109 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ 137 పరుగులతో సెంచరీని సాధించాడు.

From Twitter: Fans reaction after India thrash Bangladesh to enter semis

వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించడంతో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ టీమిండియా అభినందనలు తెలిపారు. మంచి ఆట, మంచి ప్రదర్శన అంటూ టీమిండియాపై ప్రశంసలు కురిపించారు.

భారత జట్టుకు మరోసారి అభినందనలు అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్ర బాబు నాయుడు కూడా టీమిండియాకు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. తదుపరి మ్యాచ్‌లకు ఆల్ ద బెస్ట్ అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అధ్భుతమైన ఆటతీరును ప్రదర్శించారంటూ కితాబిచ్చారు.

వరుస విజయాలతో టీమిండియా సెమీస్‌కు వెళ్లడం శుభపరిణామమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. టీమిండియాను విజయ పథంలో నడిపిన ధోనికి శుఖాకాంక్షలు తెలిపారు. ఇదే స్పూర్తితో వరల్డ్ కప్‌లో కొనసాగాలని అన్నారు.

ఇక బంగ్లాదేశ్ సాధించిన విజయానికి టీమిండియాకు ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌లో అభినందరనలు వెల్లువెత్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+