EGGS: గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా ? తేల్చేసిన పుడ్ సేఫ్టీ అథారిటీ..!
ఎన్నో దశాబ్దాలుగా భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పౌష్టికాహారంగా భావిస్తున్న కోడి గుడ్లపై ఈ మధ్య కొత్త ప్రచారం మొదలైంది. గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందనేది దీని సారాంశం. గుడ్లలో ఉండే నైట్రో ఫురాన్స్, మేతకు వాడుతున్న ఇతర రసాయనాల కారణంగా క్యాన్సర్ వస్తుందనే వాదనను పలువురు డాక్టర్లు సైతం వినిపిస్తున్నారు. దీంతో కోడిగుడ్ల వాడకాన్ని కూడా జనం తగ్గించుకునే పరిస్ధితి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిపై స్పందించింది.
గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ప్రస్తుతం డాక్టర్లు, ఇతర నిపుణులు చెప్తున్న నైట్రోఫురాన్స్ ఇందులో ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ధారించింది. అయితే అవి క్యాన్సర్ కు కారణం కాదని, ఇవి ఉత్పత్తి నిబంధనల ప్రకారం నిషేధితాలు మాత్రమే అని స్పష్టత ఇచ్చింది. అలాగే మరో కారకం ఈఎంఆర్ఎల్ పరిమితి తక్కువగా కూడా కేవలం పరీక్షా సాధనం మాత్రమేనని, దీంతో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది.

ఇప్పటికే పలు చోట్ల గుడ్లలో బయటపడిన అవశేషాలు కూడా కొన్ని బ్యాచ్ లకు చెందినవి మాత్రమేనని, మొత్తం గుడ్లు అలా ఉంటాయని చెప్పలేమని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ అవశేషాలు కొన్ని రకాల బ్రాండ్లు, ఆహారం కలుషితం కావడం వల్ల క్యాన్సర్ కు కారణమై ఉండొచ్చని వెల్లడించింది. అలాగే ప్రస్తుతం గుడ్ల పరీక్షలకు వాడుతున్న నిబంధనలు అమెరికా, ఐరోపా దేశాలతో సమానంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే సాధారణంగా గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఇప్పటివరకూ ఏ సంస్థా చెప్పలేదని కూడా తేల్చేసింది. కాబట్టి గుడ్డు ప్రియులు యథావిథిగా వాటిని తినొచ్చని తెలిపింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications