మరోసారి రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఎందుకంటే..?
Recommended Video

న్యూఢిల్లీ: మరోసారి ఇంధన ధరలు ఆకాశన్నంటాయి. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవుతుండటంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి రికార్డుస్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి.
గురువారంనాడు జీవనకాల గరిష్టానికి చేరిన డీజిల్.. శుక్రవారం మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. మరోవైపు పెట్రోల్ కూడా జీవనకాల గరిష్ట ధరను నమోదు చేసింది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర 22పైసలు పెరిగి రూ.78.52గా ఉంది. లీటర్ డీజిల్ ధర 28పైసలు పెరిగి రూ. 70.21గా ఉంది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.93, కోల్‌కతా రూ.81.44, చెన్నైలో 81.58గా ఉంది.
ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.74.54, కోల్‌కతాలో 73.06, చెన్నైలో రూ.74.18గా ఉంది. ముడి చమురు ధరలు పెరగడంతోపాటు చమురు రవాణాపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications