మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు...కొత్త రేట్లు ఇవే..!
ఢిల్లీ: నిన్నటి వరకు పెట్రోల్ ధరలు రూ.79.31గా ఉండగా... గురువారం నుంచి ఆ ధరలు ముంబైలో రూ.86.72, చెన్నైలో రూ.82.41, కోల్‌కతాలో 82.22కు పెరిగాయి. డీజిల్ ధరల్లో కూడా బుధవారం వరకు ఎలాంటి మార్పులు కనిపించలేదని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ తెలిపింది. ఢిల్లీలో డీజిల్ ధర లీటరు రూ.71.34 పలుకగా, ముంబైలో రూ.75.74, చెన్నైలో రూ.75.39 కోల్‌కతాలో రూ.74.19గా ఉంది.
అయితే దేశంలో ఇంధన ధరల పెరుగుదల శాశ్వతం కాదని... కేవలం తాత్కాలికమే అని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటంతోనే ఆ ప్రభావం ఇంధన ధరలపై పడుతోందని మంత్రి తెలిపారు.













Click it and Unblock the Notifications