బోటులో పారిపోతున్న పీఎన్బీ స్కామ్ నిందితుడు మెహుల్ ఛోక్సీని పట్టుకున్నారు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(బీఎన్బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ విదేశంలో అదృశ్యమయ్యాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, డొమినికా నుంచి క్యూబాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన పట్టుబడినట్లు సమాచారం.
ఓ చిన్నబోటు ద్వారా డొమినికా చేరుకున్న మెహుల్ చోక్సీ... అక్కడ్నుంచి క్యూబాకు పారిపోతుండగా.. స్థానిక డొమినికా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత అతడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే మెహుల్ చోక్సీపై అంతర్జాతీయ లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే.
We have asked the Dominican Government to detain him (fugitive diamantaire Mehul Choksi) for entering their country illegally, to make him persona non grata and have him deported directly to India: Antiguan PMO to ANI
— ANI (@ANI) May 26, 2021
(File photo) pic.twitter.com/gVaJB4GCGn
ఇక్కడి పోలీసుల అదుపులో ఉన్న మెహుల్ చోక్సీని నేరుగా భారత్‌కు అప్పగించాలని ఆంటిగ్వా ప్రభుత్వం డొమినికా ప్రభుత్వాన్ని కోరింది.

కాగా, 2018 నుంచి కరీబియన్ ఐస్లాండ్ నేషన్ ఆంటిగ్వా అండ్ బర్బుడాలో తలదాచుకుంటున్న 62ఏళ్ల మెహుల్ ఛోక్సీ గత కొద్ది రోజు క్రితం అదృశ్యమయ్యారు. ఈ మేరకు అతని తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించారు. ఛోక్సీ అదృశ్యం నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రముఖ రెస్టారెంట్‌లో విందు కోసం చోక్సీ వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది. చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు తెలిపారు.
ఆయన కోసం గాలింపు చేపట్టారు.
Recommended Video
ఈ నేపథ్యంలో మెహుల్ చోక్సీ డొమినికాలో అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా, 2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్ానరు. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణం బయటపడటంతో నీరవ్ మోడీతోపాటు మెహుల్ చోక్సీ దేశం వదిలి పరారయ్యారు. నీరవ్ మోడీకి మెహుల్ చోక్సీ మేనమామ. సుమారు రూ. 14వేల కోట్ల పీఎన్బీ స్కాంలో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. పీఎన్బీ స్కాం కేసులో వీరిని ఇండియా తీసుకువచ్చి విచారించేందుకు సీబీఐతోపాటు ఈడీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications