వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్: జీ23 నేతల సూచన, కానీ, ‘తెరవెనుక రాహుల్’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో ఆ పార్టీ అసమ్మతి నేతలు మరోసారి అధిష్టానంపై గళమెత్తారు. నాయకత్వ మార్పు అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీకి ఓ సీనియర్ నేతను అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్: జీ23 నేతలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్: జీ23 నేతలు

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) ఈ సాయంత్రం సమావేశం కానున్న నేపథ్యంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీలోని అసమ్మతి గ్రూపు జీ-23... పార్టీ అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్ పేరును సూచించినట్లు వార్తలు వచ్చాయి. పార్టీ చీఫ్ పదవికి వాస్నిక్ పేరును జీ23 నేతలు సూచించినప్పటికీ ఆమోదించబడలేదని వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం వెల్లడించింది.
"ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్‌లతో కూడిన G23, పార్టీ అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్ పేరును సూచించింది. కానీ అది అంగీకరించబడలేదు, "అని విశ్వసనీయవర్గాలు తెలిపాయని వార్తా సంస్థ నివేదించింది. 2000 ప్రారంభంలో సోనియా గాంధీ చేసిన విధంగా కొత్త పార్టీ అధ్యక్షులు పార్టీని నడిపించాలని జీ 23లో భాగమైన నేతలు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీని ఆపరేట్ చేసేది రాహుల్ గాంధీనే..

కాంగ్రెస్ పార్టీని ఆపరేట్ చేసేది రాహుల్ గాంధీనే..


"సోనియా గాంధీ (తాత్కాలిక) అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ, అది కెసి వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలాచే నిర్వహించబడుతోంది. వారిపై ఎటువంటి జవాబుదారీతనం లేదు, "అని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ "తెర వెనుక నుంచి పనిచేస్తున్నారు" అని తెలిపారు. "రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాదు. కానీ అతను తెర వెనుక నుంచి ఆపరేట్ చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. అతను బహిరంగంగా కమ్యూనికేట్ చేయడు, "అని జీ23 నేతలు తెలిపారు. "మేము పార్టీ శ్రేయోభిలాషులం, శత్రువులం కాదు" అని అన్నారు.
నివేదికల ప్రకారం, సీడబ్ల్యూసీ సమావేశం సాయంత్రం 4 గంటలకు షెడ్యూల్ చేయబడింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం

ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. పంజాబ్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరమైన ఫలితాలను చవిచూసింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్ని తానై విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ.. ఆ పార్టీ గెలిచిన అసెంబ్లీ స్థానాల సంఖ్య సింగిల్ డిజిట్‌ను మించలేదు. 403 సీట్లున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ తోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో పంజాబ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా.. పంజాబ్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలోనూ ఉపశమనం లభించలేదు.

English summary
Ahead Of CWC Meet, G23 Leaders Suggest Mukul Wasnik For Congress President’s Post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X