ఎన్ కౌంటర్.. కామారెడ్డికి చెందిన మావోయిస్టు ప్రభాకర్ మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రభాకర్ కూడా ఉన్నారు. ప్రభాకర్ మృతిని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ధారించారు. గడ్చిరోలి డివిజనల్ కమిటీ అధిపతిగా ఉన్న ఆయనపై రూ.50 లక్షల రివార్డు ఉంది. ఇక పోలీసులు మావోల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు కూడా మరణించారు. భమ్రగఢ్ తాలూకా ఫడేవా అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భ్రమగడ్ తాలుకా పొదెవాడ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో తొమ్మిది మావోయిస్టులు మృతి చెందారు. అయితే మృతుల్లో కామారెడ్డికి చెందిన మావోయిస్టు ప్రభాకర్ అలియాస్ చందర్ అలియాస్ పడకల స్వామి ఉన్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ధారించారు. ప్రభాకర్‌పై రూ.50లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గడ్చిరోలి డివిజనల్ కమిటీ అధిపతిగా మావోయిస్టు ప్రభాకర్ కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. మిగిలిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ కాల్పుల్లో ఓ పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే-47 రైఫిల్‌తో సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications