నా జీవితం సర్వనాశనం చేసింది వీళ్లే, నాకు ఇంకా ఆ రోగాలు రాలేదు, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి !

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇదే సమయంలో గతంలో తన జీవితం నాశనం కావడానికి అనేక ప్రయత్నాలు చేసిన అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మీద జనార్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దేవుడి దయ, దేవుడి ఆశీర్వాదం వలన తనకు ఇంకా బీపీ, షుగర్ రాలేదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

ఒక సామాన్యుడిని అడ్డుకుని వంద మంది తుపాకులతో కాల్పులు జరిపితే ఎలాగుంటుందో నాకూ అదే పరిస్థితి ఎదురైయ్యిందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా నాపై అన్ని శాఖల్లో నూట ఇరవైకి పైగా కేసులు నమోదు చేశారని జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి మాట్లాడుతూ తనను మానసికంగా కుంగదీసేందుకే ఇన్ని కేసులు నమోదు చేశారని ఆరోపించారు.

Gali Janardhan Reddy made sensational comments on the previous UPA government

తనపై ఉన్న కేసులు ఏమయ్యాయనే విషయంపై ఓ ప్రైవేట్ మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులపై నాకున్న నమ్మకం వలనే గత పన్నెండేళ్లలో అన్ని కేసుల నుంచి ఈరోజు బయటికి వచ్చానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో నాలుగు కేసులను ఒక కేసుగా విలీనం చేసి విచారణ కొనసాగిస్తున్నారని, మరో కేసుతో కలిపి కర్ణాటకలో మొత్తం రెండు కేసులు నమోదు అయ్యాయని, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ కేసు విచారణలో ఉందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

ప్రస్తుతం నాపై మూడు కేసులు విచారణలో ఉన్నాయని, ఈ మూడు కేసుల్లో సీబీఐ చార్జిషీటును సమర్పించిందని, నేను రెండు రాష్ట్రాల్లో రూ. 887 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఛార్జిషీట్ దాఖలు చేశారని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. యూపీఐ ప్రభుత్వ హయాంలో వారి చేతిలో ఉన్న సీబీఐ స్వయంగా తన మీద చార్జిషీటు దాఖలు చేసిందని, తరువాత కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక తన మీద ఎలాంటి కేసులు, చార్జిషీట్‌ దాఖలు చేయలేదని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.

Gali Janardhan Reddy made sensational comments on the previous UPA government

ఇటీవల మళ్లీ బీజేపీలో చేరిన గాలి జనార్ధన్ రెడ్డి బీఎస్ యడియూరప్ప, బీవై విజయేంద్ర నాయకత్వంలో పని చేసి కర్ణాటకలో బీజేపీకి పూర్వవైభవం తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన మీద నమోదు అయిన కేసులకు సంబంధించి నన్ను నాలుగేళ్ల పాటు జైలులో పెట్టారని, దేశ విదేశాల్లో పర్యటించి నాపై దుష్ప్రచారం చేశారని, మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేశారు.

ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని దోషిగా నిలబెట్టడానికి అన్ని అపవాదులూ చేస్తారని, కాంగ్రెస్ నాయకులు నా విషయంలో అదే చేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు దానికి బాధ పడాల్సింది వాళ్లే అని అన్నారు. నేనెప్పుడూ బహిరంగంగా చెబుతుంటాను. నేను ఏ తప్పు చేయలేదని, నాపై నాకు నమ్మకం ఉంది కాబట్టి దేవుడు నాకు బీపీ, షుగర్ తో పాటు మరే ఇతర వ్యాదులు ఇవ్వలేదని, దేవుడు తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఇవ్వలేదని, నేనేమీ తప్పు చేయలేదని, ఆ ధైర్యమే నన్ను ఆరోగ్యంగా ఉంచిందని బీజేపీ నాయకుడు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+